గోల్డ్‌లోన్ల పేరిట బ్యాంకు సిబ్బంది చేతివాటం, కేసు నమోదు
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మంలోని మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో కుంభకోణం వెలుగుచూసింది. బినామీ ఖాతాలను తెరచి బంగారం రుణం పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడిన ఈ ఘటనలో బ్యాంకు సిబ్బందే కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది. ఈ కుంభకోణంపై గత 15 రోజులుగా బ్యాంకు సిబ్బంది అంతర్గత విచారణ జరుపుతున్నారు. బంగారం డిపాజిట్ చేయకుండానే 21 మంది పేరిట బినామీ ఖాతాలను తెరచి దాదాపు రూ.3 కోట్ల వరకు సిబ్బంది స్వాహా చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రమేయం ఉందని గతంలో బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన అరుణ్‌కుమార్, అకౌంటెంట్ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేశారు. బ్యాంకు కొత్త మేనే జర్‌గా బాధ్యతలు చేపట్టిన కనకరాజు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహేశ్ బ్యాంకులో రూ.3కోట్ల కుంభకోణం
Published Wed, May 28 2014 5:11 AM | Last Updated on Thu, Aug 2 2018 4:59 PM
Advertisement