సాక్షి, హైదరాబాద్: బెనక గోల్డ్ పేరు చెప్పి కొంతమంది వ్యక్తులు తమ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ మోసగిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని వినియోగదారులు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వెనక గోల్డ్ ఎండి భరత్ కుమార్ కోరారు. జూబ్లీహిల్స్ లోని బెనక గోల్డ్ కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థలో గతంలో శివసాగర్, జగదీష్, మాణిక్ దాస్, రవీంద్ర అనే నలుగురు పనిచేసేవారని, వారు పనిచేసే సమయంలో సంస్థతోపాటు వినియోగదారులను మోసగించడంతో వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని వారిపై కేసు కూడా నమోదయిందని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా సదరు వ్యక్తులు సంస్థ బ్రాండ్ ని ఉపయోగించుకొని కొంతమంది వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని సంస్థకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని తెలిపారు. బెనక గోల్డ్ అనేది వినియోగదారులు తమ బంగారు ఆభరణాలను వివిధ సంస్థల్లో తాకట్టు పెడితే ఆ బంగారాన్ని విడిపించి వారికి నగదు చెల్లించే సంస్థ అని అన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తమ సంస్థకు చెందిన 15కుపైగా బ్రాంచీలు ఉన్నాయని కావాలని కొంతమంది సంస్థ పేరును పాడు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వారిపై త్వరలోనే నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా సంస్థ పేరు చెప్పి వినియోగదారులకు వద్దకు వస్తె అనుమానం కలిగితే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 6366111999 కు కానీ, పోలీసులకు కానీ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ లీగల్ అడ్వైజర్ మహమ్మద్ మోహిసిన్, రీజినల్ మేనేజర్ అనిల్ కుమార్, భాస్కర్ రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment