చాలామందికి తెలిసినంతవరకు వాట్సాప్ అంటే చాటింగ్ చేసుకోవడానికి, లేదా స్టేటస్ పెట్టుకోవడానికి ఉపయోగపడతాయని తెలుసు. అయితే వాట్సాప్ ద్వారా లోన్ తీసుకోవచ్చని ఎక్కువ మందికి తెలిసి ఉండక పోవచ్చు. ఇది వినటానికి కొత్తగా అనిపించినా ఇది నిజమే. ఇంతకీ వాట్సాప్ ద్వారా లోన్ ఎలా తీసుకోవాలనే దానికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడవచ్చు.
వాట్సాప్ ద్వారా లోన్ అనే సదుపాయాన్ని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కల్పిస్తోంది. దీనిద్వారా ఏకంగా రూ. 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి సేవలు అందించే మొదటి సంస్థగా IIFL రికార్డ్ సృష్టించింది.
కొన్ని నివేదికల ప్రకారం, ఒక్క మన దేశంలో మాత్రమే 45 కోట్ల కంటే ఎక్కువ మంది వాట్సాప్ వినియోగదారులున్నట్లు సమాచారం. వారిని దృష్టిలో ఉంచుకుని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఈ అవకాశం కల్పిస్తోంది. ఈ అవకాశం ఎప్పుడూ వాట్సాప్ లో అందుబాటులో ఉంటుంది. KYC, బ్యాంకు అకౌంట్ వెరిఫికేషన్ వంటివి ఆన్లైన్ లో చేసుకోవాల్సి ఉంటుంది.
(ఇదీ చదవండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?)
లోన్ కావాలనుకునే వారు 9019702184 నెంబర్ కి హాయ్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయాలి. ఆ తరువాత కంపెనీ అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది. భారతదేశంలో అతి పెద్ద ఫైనాన్సింగ్ కంపెనీలలో ఒకటైన 'ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్' ఇప్పటికే హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్, మైక్రో ఫైనాన్స్ లోన్ వంటి వాటిని అందిస్తుంది.
ఇప్పటివరకు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాట్సాప్ ద్వారా ఒక లక్ష ఎమ్ఎస్ఎమ్ఈ క్రెడిట్ విచారణలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అందరికి అందుబాటులో ఉన్న ఫైనాన్సింగ్ సంస్థల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. సంస్థ ప్రధానంగా చిన్న వ్యాపారాలుపై ద్రుష్టి పెడుతున్నట్లు కంపెనీ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ అన్నారు.
(ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇంటర్నేషనల్ కాల్స్.. క్లిక్ చేసారో మీ పని అయిపోయినట్టే!)
వాట్సప్ ద్వారా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ అందరికి రూ. 10 లక్షలు లోన్ అందిస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. బహుశా వాట్సాప్ ద్వారా మీరు అందించే సమాచారం ప్రకారం మీకు ఎంత లోన్ అందించే అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment