
న్యూఢిల్లీ: దాదాపు 80 కంపెనీలు వరుసగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు రానున్నాయని బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, స్నాప్‌డీల్, టాటా టెక్నాలజీస్, నెట్‌వెబ్ టెక్నాలజీస్, గో డిజిట్ ఇన్సూరెన్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు.
మ్యాన్‌కైండ్ ఫార్మా రూ. 4,326 కోట్ల ఇష్యూతో మొదలై గత మూడు నెలలుగా ఐపీవో మార్కెట్ చాలా సందడిగా ఉన్నట్లు గోయల్ చెప్పారు. అప్పటి నుంచి మరో ఐదు పబ్లిక్ ఇష్యూలు విజయవంతంగా పూర్తయ్యాయని, వచ్చే 4–8 వారాల్లో మరిన్ని సంస్థలు ఐపీవోకు రానున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment