హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణానికి అనుకూలమైన, హరిత గృహాల ప్రాజెక్టులకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ఐఐఎఫ్‌ఎల్ హోమ్ ఫైనాన్స్ జోనల్ హెడ్ (ఏపీ, తెలంగాణ, తమిళనాడు) శ్రీనివాసరావు రేకపల్లి తెలిపారు. నిర్దిష్ట నిబంధనలను పాటించే డెవలపర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తున్నట్లు వివరించారు. అటు కీలక వ్యాపార విభాగమైన అఫోర్డబుల్ ఇళ్లకు సంబంధించి మరిన్ని రుణాలు అందించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 2022 మార్చి ఆఖరు నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 25,300 కుటుంబాలకు రుణాలు అందించామని .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 35శాఖలు ఉన్నాయన్నారు. కొత్తగా ఏపీలో మరో 10, తెలంగాణలో 15 శాఖలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment