
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీకెండ్ మరింత మత్తెక్కించనుంది. జీహెచ్‌ఎంసీతోపాటు 5 కి.మీ. పరిధిలోని బార్లలో శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకే అనుమతి ఉంది. తాజాగా మరో గంట అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 400 వరకు పబ్బులు, బార్లు ఉన్నాయి. నిత్యం లక్ష లీటర్ల మద్యం, 5 లక్షల లీటర్ల బీర్ల విక్రయం జరుగుతోంది. తాజా నిర్ణయం వల్ల అమ్మకాలు పెరగొచ్చని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ‘అమ్మకాల సమయం పెంచాలని హోటళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో అమ్మకాలను పరిశీలించి వారంలో 2 రోజులు గంటపాటు అదనంగా అమ్మకాలకు అనుమతించాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment