సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. పెండింగ్ విద్యుత్ బిల్లులపై శుక్రవారం ఆయన బీఆర్‌కేఆర్ భవన్‌లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, డిస్కంల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు బకాయిపడిన విద్యుత్ బిల్లుల అంశంపై త్వరలో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డిస్కంలకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చర్చించి ఒక వారంలోపు సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పని చేయని బోరు బావులకు సంబంధించిన బిల్లులతోపాటు ఇతర విద్యుత్ బిల్లుల బకాయిల వివాదాలపై పంచాయతీలు, మున్సిపాలిటీలు, డిస్కం అధికారులు తక్షణమే సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment