సాక్షి, హైదరాబాద్: సోమేశ్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆసక్తికరంగా..
సీనియర్ అధికారిణి శాంతికుమారి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సీఎస్ రేసులో ఈమె పేరు కూడా ప్రముఖంగా వినిపించడం విశేషం. దీంతో సీఎస్‌గా శాంతకుమారి పేరును ఫైనలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి పేరు.. సీఎస్ రేసు లిస్ట్‌లో ప్రముఖంగా ఉంది.
ఇదిలా ఉంటే.. విభజన సమయంలో కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. దీంతో ఆయన గురువారం ఏపీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. రాజీనామా చేస్తారనే ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వెంటనే ఆయన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment