సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మాత్రం రాజకీయ ఫిరా యింపులకు పాల్పడుతూ ఇతర పారీ్టల నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు తర్వాత జనానికి దూరంగా ఉంటూ ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావ్ ఠాక్రేతో కలిసి రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతోపాటు పీఈసీ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొని సలహాలిచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వరదల్లో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలను పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
వరదలతో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సహాయం వచ్చేలా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొల్లాపూర్‌లో 30న ప్రి యాంకాగాంధీ పాల్గొనాల్సిన సభను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.
కేటీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ
వర్షాలతో గల్లీలు ఏరులై.. కాలనీలు చెరువులై ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని రేవంత్‌రెడ్డి నిలదీశారు. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంటే ప్రజల గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారంటూ కేటీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment