
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్ డ్యూటీల గడువును పొడిగించారు. కరో నా వైరస్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యం లో ఆయా కార్యాలయ ఉద్యోగుల్లో 50 శాతం మంది రొటేషన్ పద్ధతిలో రోజు విడిచి రోజు/వారం విడిచి వారం విధులకు హాజరు కావాలని గ తంలో జారీచేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ నెల 4తో ముగి సింది. గ్రేటర్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎలాంటి అవసరాలున్నా తనకు చెబితే తక్షణమే పంపించే లా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీనిచ్చారు. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని, అలాంటి మా నవత్వం ఇప్పుడెంతో అవసరమని, ఇలాంటి సేవలతో పుణ్యం లభిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వై ద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఫీవర్, గాంధీ ఆస్పత్రుల æ సూపరింటెండెంట్లు డాక్టర్ శంకర్, డాక్టర్ రాజారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment