![TS CS Somesh Kumar Review Attendance And Wants School Staff Fully Vaccinated - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/4/Telangana-Shcools.gif.webp?itok=J4Y5C4Ms)
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల టీకా వివరాలకు సంబంధించి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో 18 ఏళ్ళు ఆపై వయస్సు కల్గిన విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారు దగ్గర్లోని పీహెచ్‌సీ కేంద్రాల్లో వేసుకోవాలని ఆయన సూచించారు.
చదవండి: ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..!
వంద శాతం పూర్తి చేసుకున్న విద్యాసంస్థల్లో బ్యానర్ రాసి ప్రదర్శించాలి ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 10 లోపు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. పాఠశాలలకు అనుబంధంగా ఉన్న బస్సు డ్రైవర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది, ఇతర సిబ్బందికి టీకాలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కలెక్టర్లు, జిల్లా అధికారులను తెలిపారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల కార్మికుడు ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే, ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రి లేదా పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని అన్నారు. అక్కడ వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
చదవండి: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షం
Comments
Please login to add a commentAdd a comment