ఏప్రిల్ లో కొత్త మద్యం విధానం
మహానంది: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుందని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానంది క్షేత్రానికి చేరుకున్నారు. దర్శనానంతరం విలేకరులతో మాట్లాడారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించినందుకు ప్రస్తుతం ఉన్న రూ. లక్ష జరిమానాను రూ. 5 లక్షలకు పెంచినట్లు తెలిపారు. హోలోగ్రాఫిక్ లేబుళ్లతో పాటు ట్రాక్ అండ్ ట్రేస్, బిల్లింగ్ స్కానింగ్ వంటి ఆధునాతన విధానాలను బార్లు, రెస్టారెంట్లు, వైన్స్‌లో అమల్లోకి తేనున్నట్లు వెల్లడించారు.