హైదరాబాద్‌: పబ్బులు, బార్లకు హైకోర్టు నోటీసులు | TS High Court Notice To Pubs And Bars In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: పబ్బులు, బార్లకు హైకోర్టు నోటీసులు

Published Thu, Dec 23 2021 8:29 AM | Last Updated on Thu, Dec 23 2021 3:13 PM

TS High Court Notice To Pubs And Bars In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోని పబ్బులు, బార్ల నుంచి శబ్ధకాలుష్యం వస్తోందంటూ దాఖ లైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ, నగర పోలీసు కమిషనర్‌తోపాటు ప్రతివాదులుగా ఉన్న పబ్బులు, బార్ల యజమానులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ నివాస ప్రాంతాలకు సమీపంలో ఏర్పాటు చేసిన పబ్బులు, బార్లతో తీవ్రమైన శబ్ధకాలుష్యం ఏర్పడుతోందని జూబ్లీహిల్స్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.   
చదవండి: తెలంగాణ: రైళ్ల వేళల్లో మార్పులు.. కొత్త టైంటేబుల్‌ విడుదల..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement