సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పబ్‌ల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మ్యూజిక్ సౌండ్ ఆపాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. జూబ్లీహిల్స్ పబ్‌లు జనావాసాల మధ్య ఉన్నందున దీనిపై ఎటువంటి వెసులుబాటు ఇవ్వ లేమని ఆ పబ్‌లకు తేల్చిచెప్పింది.
ఫర్జీ కేఫ్, అమ్నీసియా లాంజ్ బార్, బ్రాడ్‌వే ది బ్రూవరీ పబ్‌లకు గతంలోనే ఈ మేరకు ఆదేశాలు ఇవ్వగా.. శుక్రవారం సన్‌బర్న్ సూపర్‌క్లబ్‌కు ఇదే ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వు లను సవాల్ చేస్తూ సన్‌బర్న్ సూపర్‌క్లబ్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వాదనలు విన్న ధర్మాసనం.. జూబ్లీహిల్స్‌లోని పబ్‌లు జనావాసాల మధ్య ఉన్నందున వెసు లుబాటు ఇవ్వలేమంటూ మధ్యంతర పిటిషన్ ను కొట్టివేసింది. రాత్రి పది తర్వాత సౌండ్ పెట్టొద్దని ఆదేశించింది. సౌండ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నిబంధనలను పాటించడంలేదని జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ సహా మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి పలు నిబంధనలు విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment