సాక్షి, హైదరాబాద్: నగరంలోని పబ్స్‌పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజేలు ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. రాత్రి 10 నుంచి ఉదయం ఆరు గంటల వరకు డీజేలపై నిషేధం విధించింది. డీజేలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: నేను రాజీనామా చేస్తా..! సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్..
సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని, రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని హై కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యాసంస్థల ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. పబ్‌లకు ఏ అంశాలను పరిగణించి అనుమతులు ఇచ్చారో ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ల తరపున హైకోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment