‘గ్రేటర్’లో బార్లకు గేట్లు బార్లా!
- తాజాగా 88 కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల
- ఈనెల 18 వరకు దరఖాస్తుల జారీ
- డిసెంబర్ 8 నుంచి 20 వరకు లెసైన్సుల జారీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త బార్లకు గేట్లు బార్లా తెరుచుకున్నారుు. నూతన ఆబ్కారీ పాలసీ ప్రకారం.. 11 వేల జనాభాకు ఒకటి చొప్పున మహానగరంలో సుమారు 659 బార్లు ఏర్పాటు చేయవచ్చని సర్కారు నిర్ణరుుంచింది. ఈ నేపథ్యంలో నూతనంగా 88 బార్లకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి ఏర్పాటుకు సంబంధించి ఈనెల 10 నుంచి దరఖాస్తుల విక్రయం ప్రారంభమైందని.. 18 వరకు ఒక్కోటి రూ. 50 వేల చొప్పున విక్రరుుంచనున్నట్లు నగర ఎకై ్సజ్ విభాగం డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి తెలిపారు. ఈనెలాఖరు వరకు మూల్యంకన ప్రక్రియ పూర్తిచేసి డిసెంబర్ 8 తరువాత కొత్త లెసైన్సులు జారీ చేస్తామన్నారు. నూతన బార్లకు లెసైన్సు ఫీజు ఏడాదికి రూ.40 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రెస్టారెంట్ ఉండి.. అవసరమైన స్థలం అందుబాటులో ఉన్నవారు, ట్రేడ్ లెసైన్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా తాజాగా ప్రభుత్వం కొత్త బార్లకు నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల మహిళా, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నారుు.
పదకొండు వేలకు ఒకటి చొప్పున...
మహానగరం పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 72.44 లక్షల జనాభా ఉండగా.. ఇందులో 11 వేలకు ఒకటి చొప్పున బార్లుండాలని ప్రభుత్వం నూతన ఆబ్కారీ పాలసీలో పేర్కొంది. ఈలెక్కన 659 బార్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 571 బార్లకు అదనంగా మరో 88 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 145 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో సగానికి పైగా గ్రేటర్‌లోనే ఉండడం గమనార్హం.
మినీ బ్రేవరేజెస్‌కు స్పందన అంతంతే...!
మందుబాబులకు క్షణాల్లో తాజా బీరును అందించేందుకు గ్రేటర్ పరిధిలో 20 మినీ బ్రేవరేజెస్‌కు ఆబ్కారీ శాఖ అనుమతిం చినప్పటికీ నగరంలో మూడు చోట్ల మాత్రమే అవి తెరచుకున్నట్లు ఎకై ్సజ్‌శాఖ వర్గాలు తెలిపారుు. వీటి ఏర్పాటుకు రూ.6 లక్షలు లెసైన్సు ఫీజు అరుునప్పటికీ ఉత్పత్తిపై విధిం చే అప్‌ఫ్రంట్ ట్యాక్స్ అధికంగా ఉండడం, వీటి ఏర్పాటుకు వినియోగించే యంత్ర పరిక రాల ఖరీదు రూ.7 కోట్ల వరకు ఉండడంతో నిర్వాహకులు ముందుకురావడం లేదన్నారు.
నోట్ల ఎఫెక్ట్.. తగ్గిన మద్యం అమ్మకాలు...
రూ.500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో నగరంలోని మద్యం దుకాణాలు, బార్లకు గడిచిన నాలుగు రోజులుగా గిరాకీ 50 శాతం మేర తగ్గినట్లు వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చేసేదిలేక పలు బార్లు, మద్యం దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగంతో సైతం మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కాగా కార్మికులు, కూలీలు అధికంగా కొనుగోలు చేసే చీప్‌లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోరుునట్లు వాపోయారు.
కొత్త బార్లకు అనుమతులిలా...
గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్య: 571
నూతనంగా ఏర్పాటు కానున్న
బార్లు: 88
కొత్త బార్లకు దరఖాస్తుల గడువు:
నవంబర్ 10 నుంచి 18 వరకు
దరఖాస్తుల మూల్యంకనం:
నవంబర్ 19 నుంచి 24 వరకు
దరఖాస్తుల తిరస్కరణ, ఆమోదం: నవంబర్ 28
పోటీ అధికంగా ఉండే బార్లకు
డ్రా తీసే తేదీ: డిసెంబర్ 5
నూతన బార్లకు లెసైన్సుల మంజూరు: డిసెంబర్ 8 నుంచి 20 వరకు
లెసైన్సు ఫీజు: ఏడాదికి రూ.40 లక్షలు
దరఖాస్తు ఫీజు: రూ.50 వేలు