సాక్షి,కాగజ్‌నగర్: ప్రజలు తాగి ఊగాలని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకూ వైన్స్‌లు, బార్లకు ప్రభుత్వం అనుమతులిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. ‘మేం నిరుద్యోగదీక్ష చేపడతామంటే ఒమిక్రాన్ పేరుతో అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకూ జనం తాగి ఊగితే వైరస్ వ్యాప్తిచెందదా?’అని ప్రశ్నించారు.
మద్యం అమ్మకాల మీద వచ్చే పైసల కోసమే ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఆ పార్టీ జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చిబియ్యం ఎంతైనా కొంటామని కేంద్రం స్పష్టంగా చెప్పిందని తెలిపారు. ‘బాయిల్డ్ రైస్ నువ్వు తినవు, కానీ పక్క రాష్ట్రంలో తినాలా’ అని సీఎంను నిలదీశారు. ‘మీ ఫాంహౌస్‌లో మీరు చేస్తున్నదమేమిటీ.. అక్కడ వరి పండిస్తూ, రైతులు పండిస్తే మాత్రం ఉరి అంటారా’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment