AP: దూర దూరం.. బార్లు | AP Govt Not Increased The Number Of Bars | Sakshi
Sakshi News home page

AP: దూర దూరం.. బార్లు

Published Thu, Jul 21 2022 8:30 AM | Last Updated on Thu, Jul 21 2022 8:44 AM

AP Govt Not Increased The Number Of Bars - Sakshi

సాక్షి, అమరావతి: కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం నిర్వహణకు ఎక్సైజ్‌ శాఖ సన్నద్ధమవుతోంది. పూర్తి పారదర్శకంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం విధి విధానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను పెంచకూడదని ప్రభుత్వం ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకుంది. అదే విధానం ప్రాతిపదికన సామాన్యులకు ఇబ్బందులు లేకుండా బార్లను కేటాయించే రీతిలో మార్గదర్శకాలు రూపొందించింది. పట్టణాలు, నగరాల్లో సామాన్యులకు ఇబ్బంది తలెత్తకుండా బార్ల కేటాయింపు ఉండేలా ఎక్సైజ్‌ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త బార్లు అమలులోకి వచ్చేలా ఇ–వేలం నిర్వహణ షెడ్యూల్‌ను ఖారారు చేస్తూ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను సూత్రప్రాయంగా ఆమోదించింది. తుది ఆమోదం తర్వాత ఈనెల 21న నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.

బార్ల సంఖ్య పెంచని ప్రభుత్వం
ఐదేళ్లుగా రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం కూడా వాటి సంఖ్యను పెంచకుండా కొత్త లైసెన్సులను 840 బార్లకే పరిమితం చేయనున్నారు. దగ్గర దగ్గరగా బార్ల ఏర్పాటుతో సామాన్యులు  ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి బార్లు దూర దూరంగా ఉండేలా విధి విధానాలను ఖరారు చేసింది. గత ఐదేళ్లుగా 106 మున్సిపల్‌ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో 840 బార్లు ఉన్నాయి. సూత్రప్రాయంగా ఆమోదించిన నోటిఫికేషన్‌ ప్రకారం అవే 840 బార్లను 130 మున్సిపల్‌ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటివరకు ఉన్న నగరాలు, పట్టణాల్లో బార్ల సంఖ్యను తగ్గించారు. కొత్త మున్సిపాలిటీలు, డివిజన్‌ కేంద్రాల్లో ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేస్తారు. దీంతో ఒకే మున్సిపల్‌ కార్పొరేషన్‌/మున్సిపాలిటీ పరిధిలో బార్ల సంఖ్య తగ్గుతుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 10 కి.మీ. పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కి.మీ. పరిధిలో బార్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లా పరిధి మాత్రం దాటకూడదు. ఈ రెండు నిబంధనలతో బార్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. 

పక్కాగా సుప్రీం మార్గదర్శకాలు అమలు
బార్ల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించనుంది. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, జాతీయ రహదారికి సమీపంలో బార్లను అనుమతించరు. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నోటిఫికేషన్‌లో విధివిధానాలను నిర్దేశించనున్నారు. పూర్తి పారదర్శకంగా బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇ–వేలం ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఎవరు ఎంత కోట్‌ చేశారన్న వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఎక్సైజ్‌ శాఖ సూత్రప్రాయంగా ఆమోదించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ వివరాలు ఇలా... 
ఈ నెల 22 నుంచి 27 వరకు బార్‌ లైసెన్సుల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ నెల 30, 31వ తేదీల్లో ఇ–వేలం నిర్వహిస్తారు. 
ఇ–వేలంలో ఒకరికంటే ఎక్కువమంది ఒకే మొత్తాన్ని కోట్‌ చేస్తే లాటరీ విధానంలో లైసెన్స్‌ కేటాయిస్తారు. 
వేలంలో లైసెన్స్‌ పొందినవారు అనంతరం ఒక రోజులో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే ఆ కేటాయింపును రద్దు చేసి మళ్లీ ఇ–వేలం నిర్వహిస్తారు. 
లైసెన్సులు పొందినవారు తమకు కేటాయించిన మున్సిపల్‌ కార్పొరేషన్‌/ మున్సిపాలిటీ పరిధిలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం బార్లు ఏర్పాటు చేసుకోవాలి. 
సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త బార్లను నిర్వహించుకునేందుకు అనుమతి. లైసెన్స్‌ కాల పరిమితి మూడేళ్లు ఉంటుంది. 
మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలవారీగా బార్లు

ఆమదాలవలస 2, పలాస కాశీబుగ్గ 2, ఇచ్ఛాపురం 2, సాలూరు 3,  పార్వతీపురం 4, పాలకొండ 1, నెల్లిమర్ల 1, బొబ్బిలి 3, రాజాం 4, అమతమవారివలస(టూరిజం రిసార్ట్‌) 1, ఎస్‌.కోట (టూరిజం రిసార్ట్‌)1, నర్సీపట్నం 2, యలమంచిలి 1, సామర్లకోట1, పిఠాపురం1, గొల్లప్రోలు 1, పెద్దాపురం 1, తుని 1, మండపేట 2, అమలాపురం 3, ముమ్మడివరం 1, రామచంద్రాపురం 3, నిడదవోలు 3, కొవ్వూరు 2, కడియపులంక (టూరిజం రిసార్ట్‌) 1, జంగారెడ్డిగూడెం 2, నూజివీడు 3, చింతలపూడి 1, తణుకు 5, పాలకొల్లు 6, నరసాపురం 2, తాడేపల్లిగూడెం 4, భీమవరం 6, తాడిగడప 12, పెడన 1, గుడివాడ 10, ఉయ్యూరు 1, మంగినపూడి(టూరిజం సెంటర్‌) 1, అవనిగడ్డ( టూరిజం సెంటర్‌)2, జగ్గయ్యపేట 2, నందిగామ 1, తిరువూరు 1, కొండపల్లి 8, తెనాలి    20, పొన్నూరు 4, బాపట్ల 5, రేపల్లె 5, చీరాల 6, అద్దంకి 1, నరసరావుపేట 16, చిలకలూరిపేట 11, సత్తెనపల్లి 4, పిడుగురాళ్ల 6, గురజాల 2, దాచేపల్లి 3. మాచర్ల 3, వినుకొండ 8, మార్కాపురం 5, చీమకుర్తి 1, కనిగిరి 1, గిద్దలూరు 1, పొదిలి 1, దర్శి 1, ఆత్మకూరు 1, కావలి 6, కందుకూరు 3, బుచ్చిరెడ్డిపాలెం 1, అల్లూరు 1, పుంగనూరు 1, పలమనేరు 1, నగరి 1, కుప్పం 1, పుత్తూరు 1, శ్రీకాళహస్తి 3, తొండవాడ( టూరిజం రిసార్ట్‌) 1, గూడూరు 3, నాయుడుపేట 1, సూళ్లూరుపేట 1, వెంకటగిరి 1, మదనపల్లి 4, బి.కొత్తకోట 1, పీలేరు 1, రాయచోటి 2, రాజంపేట 2, ప్రొద్దుటూరు 8, బద్వేల్‌ 2, మైదుకూరు 1, జమ్మలమడుగు1, ఎర్రగుంట్ల 1, పులివెందుల 1, కమలాపురం 1, ఆదోని 5, ఎమ్మిగనూరు 3, గూడూరు 1, నంద్యాల 15, డోన్‌ 2, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు( నంద్యాల జిల్లా) 1,  బేతంచర్ల 1, గుంతకల్‌ 3, తాడిపత్రి 3, రాయదుర్గం 1, గుత్తి 1, కల్యాణదుర్గం 1, హిందూపూర్‌ 3, కదిరి 3, ధర్మవరం 2, పెనుకొండ 2, మడకశిర 1.

గ్రేటర్‌ విశాఖ 134   (అనకాపల్లి పరిధిలో 6)
విజయవాడ 110
శ్రీకాకుళం 12
విజయనగరం 17
కాకినాడ 11
రాజమహేంద్రవరం 16
ఏలూరు 10
మచిలీపట్నం 10 
గుంటూరు 67 
మంగళగిరి 17 
ఒంగోలు 15 
నెల్లూరు 35 
తిరుపతి 16 
చిత్తూరు 7 
కడప 12 
కర్నూలు 18 
అనంతపురం 10 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement