Bars Policy
-
అనుమతి లేని 75 బార్లు సీజ్
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బార్లను గుర్తించిన పోలీసులు 75 బార్లకు సీల్ వేశారు. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి, గుమ్మిడిపూండి, తిరువళ్లూరు, తిరుత్తణి, ఆర్కేపేట, పళ్లిపట్టు, ఊత్తుకోట తదితర ఏడు తాలుకా పరిధిలో 137 టాస్మాక్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఈ దుకాణాలకు కాకలూరులోని గోధాము నుంచి మద్యం సరఫరా చేస్తున్నారు. కాగా 137 టాస్మాక్ దుకాణాలకు సమీపంలో బార్ నిర్వహించుకోవడానికి 20 మందికి మాత్రమే గతంలో అనుమతి ఇచ్చారు. మిగిలిన దుకాణాలకు సమీపంలో బార్లను నిర్వహించుకోవడానికి గత ఆగస్టు19న వేలం వేయగా మరో 36 దుకాణాల వద్ద బార్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు. మిగిలిన టాస్మాక్ దుకాణాలకు సమీపంలో బార్ నిర్వాహణకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా జిల్లా వ్యాప్తంగా వందకు పైగా బార్లను నిర్వహిస్తున్నట్టు తిరువళ్లూరు ఎస్పీ పకెర్లా సెఫాస్ కల్యాణ్‌కు ఫిర్యాదులు అందాయి. దాడులు నిర్వహించాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. దీంతో 10 బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 75 బార్లను గుర్తించి సీజ్ చేశారు. బార్లో రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. కాగా అనుమతి లేని బార్ల సీజ్ వ్యవహరంపై ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలో కల్తీసారా తాగి 20 మందికి పైగా మృతి చెందారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి జిల్లాలో రాకుడదన్న ఉద్దేశంతోనే దాడులు నిర్వహించి అనుమతి లేని బార్లను సీజ్ చేశామని తెలిపారు. భవిషత్తులోనూ మరిన్ని దాడుల చేస్తామన్నారు. -
AP: దూర దూరం.. బార్లు
సాక్షి, అమరావతి: కొత్త బార్ల పాలసీకి అనుగుణంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం నిర్వహణకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది. పూర్తి పారదర్శకంగా బార్ల కేటాయింపు కోసం ఇ–వేలం విధి విధానాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను పెంచకూడదని ప్రభుత్వం ఇప్పటికే విధాన నిర్ణయం తీసుకుంది. అదే విధానం ప్రాతిపదికన సామాన్యులకు ఇబ్బందులు లేకుండా బార్లను కేటాయించే రీతిలో మార్గదర్శకాలు రూపొందించింది. పట్టణాలు, నగరాల్లో సామాన్యులకు ఇబ్బంది తలెత్తకుండా బార్ల కేటాయింపు ఉండేలా ఎక్సైజ్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లు అమలులోకి వచ్చేలా ఇ–వేలం నిర్వహణ షెడ్యూల్‌ను ఖారారు చేస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సూత్రప్రాయంగా ఆమోదించింది. తుది ఆమోదం తర్వాత ఈనెల 21న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. బార్ల సంఖ్య పెంచని ప్రభుత్వం ఐదేళ్లుగా రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. ప్రస్తుతం కూడా వాటి సంఖ్యను పెంచకుండా కొత్త లైసెన్సులను 840 బార్లకే పరిమితం చేయనున్నారు. దగ్గర దగ్గరగా బార్ల ఏర్పాటుతో సామాన్యులు ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి బార్లు దూర దూరంగా ఉండేలా విధి విధానాలను ఖరారు చేసింది. గత ఐదేళ్లుగా 106 మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో 840 బార్లు ఉన్నాయి. సూత్రప్రాయంగా ఆమోదించిన నోటిఫికేషన్ ప్రకారం అవే 840 బార్లను 130 మున్సిపల్ కార్పొరేషన్లు/ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఇప్పటివరకు ఉన్న నగరాలు, పట్టణాల్లో బార్ల సంఖ్యను తగ్గించారు. కొత్త మున్సిపాలిటీలు, డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేస్తారు. దీంతో ఒకే మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ పరిధిలో బార్ల సంఖ్య తగ్గుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో 10 కి.మీ. పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కి.మీ. పరిధిలో బార్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. జిల్లా పరిధి మాత్రం దాటకూడదు. ఈ రెండు నిబంధనలతో బార్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. పక్కాగా సుప్రీం మార్గదర్శకాలు అమలు బార్ల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించనుంది. విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, జాతీయ రహదారికి సమీపంలో బార్లను అనుమతించరు. ఈ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నోటిఫికేషన్లో విధివిధానాలను నిర్దేశించనున్నారు. పూర్తి పారదర్శకంగా బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇ–వేలం ద్వారా లైసెన్సులు కేటాయిస్తారు. ఎవరు ఎంత కోట్ చేశారన్న వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. ఎక్సైజ్ శాఖ సూత్రప్రాయంగా ఆమోదించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వివరాలు ఇలా... ఈ నెల 22 నుంచి 27 వరకు బార్ లైసెన్సుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియతోపాటు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 30, 31వ తేదీల్లో ఇ–వేలం నిర్వహిస్తారు. ఇ–వేలంలో ఒకరికంటే ఎక్కువమంది ఒకే మొత్తాన్ని కోట్ చేస్తే లాటరీ విధానంలో లైసెన్స్ కేటాయిస్తారు. వేలంలో లైసెన్స్ పొందినవారు అనంతరం ఒక రోజులో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే ఆ కేటాయింపును రద్దు చేసి మళ్లీ ఇ–వేలం నిర్వహిస్తారు. లైసెన్సులు పొందినవారు తమకు కేటాయించిన మున్సిపల్ కార్పొరేషన్/ మున్సిపాలిటీ పరిధిలో నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం బార్లు ఏర్పాటు చేసుకోవాలి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్లను నిర్వహించుకునేందుకు అనుమతి. లైసెన్స్ కాల పరిమితి మూడేళ్లు ఉంటుంది. మున్సిపాలిటీలు/ నగర పంచాయతీలవారీగా బార్లు ఆమదాలవలస 2, పలాస కాశీబుగ్గ 2, ఇచ్ఛాపురం 2, సాలూరు 3, పార్వతీపురం 4, పాలకొండ 1, నెల్లిమర్ల 1, బొబ్బిలి 3, రాజాం 4, అమతమవారివలస(టూరిజం రిసార్ట్) 1, ఎస్.కోట (టూరిజం రిసార్ట్)1, నర్సీపట్నం 2, యలమంచిలి 1, సామర్లకోట1, పిఠాపురం1, గొల్లప్రోలు 1, పెద్దాపురం 1, తుని 1, మండపేట 2, అమలాపురం 3, ముమ్మడివరం 1, రామచంద్రాపురం 3, నిడదవోలు 3, కొవ్వూరు 2, కడియపులంక (టూరిజం రిసార్ట్) 1, జంగారెడ్డిగూడెం 2, నూజివీడు 3, చింతలపూడి 1, తణుకు 5, పాలకొల్లు 6, నరసాపురం 2, తాడేపల్లిగూడెం 4, భీమవరం 6, తాడిగడప 12, పెడన 1, గుడివాడ 10, ఉయ్యూరు 1, మంగినపూడి(టూరిజం సెంటర్) 1, అవనిగడ్డ( టూరిజం సెంటర్)2, జగ్గయ్యపేట 2, నందిగామ 1, తిరువూరు 1, కొండపల్లి 8, తెనాలి 20, పొన్నూరు 4, బాపట్ల 5, రేపల్లె 5, చీరాల 6, అద్దంకి 1, నరసరావుపేట 16, చిలకలూరిపేట 11, సత్తెనపల్లి 4, పిడుగురాళ్ల 6, గురజాల 2, దాచేపల్లి 3. మాచర్ల 3, వినుకొండ 8, మార్కాపురం 5, చీమకుర్తి 1, కనిగిరి 1, గిద్దలూరు 1, పొదిలి 1, దర్శి 1, ఆత్మకూరు 1, కావలి 6, కందుకూరు 3, బుచ్చిరెడ్డిపాలెం 1, అల్లూరు 1, పుంగనూరు 1, పలమనేరు 1, నగరి 1, కుప్పం 1, పుత్తూరు 1, శ్రీకాళహస్తి 3, తొండవాడ( టూరిజం రిసార్ట్) 1, గూడూరు 3, నాయుడుపేట 1, సూళ్లూరుపేట 1, వెంకటగిరి 1, మదనపల్లి 4, బి.కొత్తకోట 1, పీలేరు 1, రాయచోటి 2, రాజంపేట 2, ప్రొద్దుటూరు 8, బద్వేల్ 2, మైదుకూరు 1, జమ్మలమడుగు1, ఎర్రగుంట్ల 1, పులివెందుల 1, కమలాపురం 1, ఆదోని 5, ఎమ్మిగనూరు 3, గూడూరు 1, నంద్యాల 15, డోన్ 2, ఆళ్లగడ్డ 1, నందికొట్కూరు 1, ఆత్మకూరు( నంద్యాల జిల్లా) 1, బేతంచర్ల 1, గుంతకల్ 3, తాడిపత్రి 3, రాయదుర్గం 1, గుత్తి 1, కల్యాణదుర్గం 1, హిందూపూర్ 3, కదిరి 3, ధర్మవరం 2, పెనుకొండ 2, మడకశిర 1. గ్రేటర్ విశాఖ 134 (అనకాపల్లి పరిధిలో 6) విజయవాడ 110 శ్రీకాకుళం 12 విజయనగరం 17 కాకినాడ 11 రాజమహేంద్రవరం 16 ఏలూరు 10 మచిలీపట్నం 10 గుంటూరు 67 మంగళగిరి 17 ఒంగోలు 15 నెల్లూరు 35 తిరుపతి 16 చిత్తూరు 7 కడప 12 కర్నూలు 18 అనంతపురం 10 -
బార్ల సంఖ్య పెంచకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బార్ల సంఖ్య పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త బార్ పాలసీని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, జిల్లాలు పెరిగిన బార్ల సంఖ్య పెంచకూడదని ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. కాగా, 840 బార్ల లైసెన్స్‌లు మరో రెండు నెలలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఈలోగా బార్ల లైసెన్స్‌లు పొందేందుకు వేలం, లాటరీ నిర్వహించాలని నిర్ణయించింది. -
మందుబాబులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: మందుబాబులకు హర్యానా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 గంటలపాటు బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ పాలసీని తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్‌లో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఏడాది కాలానికి గాను రిటైల్ లిక్కర్ లైసెన్స్ ఫీజుకు మరో రూ. 18 లక్షలు అదనంగా చెల్లించిన బార్లు, రెస్టారెంట్లు 24 గంటలపాటూ మద్యాన్ని విక్రయించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మద్యంపై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు, రెస్టారెంట్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యాన్ని అమ్మడానికి అనుమతినిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే అవకాశమున్నదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయాన్ని బార్లు, రెస్టారెంట్ల యజమానులు స్వాగతించడం గమనార్హం. ఇది కూడా చదవండి: సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు -
మద్యం కేసుల్లో శిక్ష పడితే నో లైసెన్స్
సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి బార్ల కేటాయింపులో నూతన పాలసీకి ప్రభుత్వం పదును పెట్టింది. ఆ మేరకు నియమ నిబంధనలతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన విధానం ప్రకారం.. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడా బార్లు, మైక్రో బ్రూవరీలు ఉండవు. మద్యం కేసుల్లో శిక్ష పడిన వారు, 21 ఏళ్ల లోపు వయస్సున్న వారు, ప్రభుత్వానికి ఎక్సైజ్ రెవెన్యూ ఎగవేతదారులకు, కుష్టు వ్యాధి, ఇతర వ్యాధులున్న వారికి లైసెన్సులు మంజూరు చేయరు. బార్‌ను కనీసం 200 చదరపు మీటర్లలో ఏర్పాటు చేయాలి. వాటికి అనుబంధంగా ఏర్పాటయ్యే రెస్టారెంట్, కిచెన్ 15 చదరపు మీటర్లలో ఉండాలి. గుర్తింపున్న విద్యా సంస్ధలకు, దేవదాయ శాఖ గుర్తించిన దేవాలయాలు, వక్ఫ్‌బోర్డు గుర్తింపున్న మసీదులు, రిజిస్టర్డ్ క్రైస్తవ సంస్థలు నిర్వహించే చర్చిలకు, ఆస్పత్రులకు 100 మీటర్లలోపు బార్లు ఏర్పాటు చేయరాదు. జాతీయ, రాష్ట్ర రహదార్లకు 500 మీటర్ల లోపు దూరంలో ఉండకూడదు. అక్టోబర్ 2, ఆగష్టు 15, జనవరి 26 తేదీలను డ్రై డేలుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గించి వాటి సంఖ్యను ఎక్సైజ్ కమిషనర్ ప్రకటిస్తారు. దరఖాస్తు , లైసెన్సు ఫీజుల్ని ప్రకటించారు. బార్ల లైసెన్స్‌కు ఇతర నియమ నిబంధనలివే.. - బార్, మైక్రో బ్రూవరీని నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రెండు కి.మీ. పరిధిలోనూ, కార్పొరేషన్లలో 5 కి.మీ. పరిధిలో ఏర్పాటు చేయాలి. - దరఖాస్తు రుసుం రూ.10 లక్షలు. దీన్ని తిరిగి ఇవ్వరు - స్టార్ హోటళ్లు, బ్రూవరీలను మినహాయించి మిగిలిన 797 బార్లలో 40 శాతం తగ్గించి 478 బార్లకే లైసెన్సులిస్తారు. ఉదాహరణకు ఏదైనా మున్సిపాలిటీలో పది బార్లుంటే.. వాటిలో నాలుగు తగ్గిస్తారు. అదే ఒక బార్ ఉంటే అలానే ఉంచుతారు. - బార్‌కు దరఖాస్తు చేసుకునే వారు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. లేదా ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ యాక్టు–2006 ప్రకారం లైసెన్స్ పొందాలి. - వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటలు. ఆహార సరఫరా 11 వరకూ ఉంటుంది. త్రీస్టార్, ఆపైస్థాయి హోటళ్లకు వ్యాపార వేళలు ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకు, ఆహార సరఫరా అర్ధరాత్రి 12 వరకు. - లైసెన్సు మార్పిడి, కొత్త లైసెన్స్ ప్రకటన ఎక్సైజ్ కమిషనర్ అనుమతితోనే ఉంటుంది. ఎక్సైజ్ చట్టం 31, 32 ప్రకారం లైసెన్స్ రద్దు చేసే, ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. -
13 వేల మందికో బార్
విస్తీర్ణాన్ని బట్టి లెసైన్స్ ఫీజు వసూలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త బార్ల పాలసీ తుది రూపు దిద్దుకుంటోంది. 2016-17 సంవత్సరానికి వర్తించే ఈ పాలసీ తుది ముసాయిదాను ఆబ్కారీ శాఖ సోమవారం ప్రభుత్వానికి పంపించింది. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనుంది. కొత్త పాలసీలో బార్ల లెసైన్సు ఫీజులను విస్తీర్ణం ఆధారంగా వసూలు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 3 స్లాబుల్లోని ఫీజులను యథాతథంగానే కొనసాగించనున్నారు. జనాభా ఆధారంగా 13 వేలకు ఒక బార్ చొప్పున లెసైన్సులు మంజూరు చేయనున్నారు. బార్లలో మద్యం సరఫరా చేసే ఏరియా 500 చదరపు మీటర్ల వరకు ఇప్పుడున్న ఫీజులు వర్తిస్తాయి. 500 నుంచి 700 చదరపు మీటర్లు ఉంటే 10 శాతం, 700 నుంచి 1,000 చదరపు మీటర్లు ఉంటే 20 శాతం, వెయ్యి చదరపు మీటర్ల పైన ఉన్న బార్లు 40 శాతం అదనంగా ఫీజు చెల్లించాలి. నగరంలో 70కి పైగా ఉన్న స్టార్ హోటళ్లను టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైవేలకు వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండకూడదన్న సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నిబంధనలు రాష్ట్రంలో వర్తించవని తేల్చిన నేపథ్యంలో గతంలో తిరస్కృతికి గురైన బార్ల దరఖాస్తులను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో మరో 98 వరకు బార్లను ఏర్పాటు చేసే వెసులుబాటు లభించనుంది.