ఆహారం, పానీయాలపై సర్వీస్ చార్జీ చెల్లించొద్దు: కేంద్రం
న్యూఢిల్లీ: హోటళ్లలో ఆహారం, పానీయాలపై కస్టమర్లకు సేవల రుసుము (సర్వీస్ చార్జ్) విధింపు ఎంతమాత్రం సమంజసం కాదని కేంద్ర వినిమయ వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ బుధవారం స్పష్టం చేశారు. ఇలాంటి రుసుముల విధింపు అసమంజస వ్యాపార పద్దతి కిందకే వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి చార్జీని వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే ఇలాంటి చార్జీలు విధించిన హోటళ్లు, రెస్టారెంట్లపై న్యాయపరమైన చర్యలకు ప్రస్తుత చట్టాల నిబంధనలు ఏవీ వీలు కల్పించడంలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.