ICICI Banking Service Charges Change From August 1 2021 - Check Details - Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!

Published Wed, Jul 28 2021 4:08 PM | Last Updated on Wed, Jul 28 2021 4:39 PM

ICICI Bank Service Charges To Change From 1 August 2021 - Sakshi

అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి మారనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, దేశీయ పొదుపు ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ ఛార్జీల గురించి ఈ క్రింద పేర్కొన్నాము.

  • ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.
  • 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) మాత్రమే ఉచితంగా లభిస్తాయి.
  • మెట్రో నగరాలు కాకుండా ఇతర అన్ని ప్రాంతాల్లో మొదటి 5 లావాదేవీలు ఉచితం.
  • ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది.
  • ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది.
  • నాన్ హోమ్ బ్రాంచీలో రోజుకు ₹25,000 వరకు నిర్వహించే క్యాష్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ₹25,000 కంటే ఎక్కువ లావాదేవిలు జరిపితే ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది.
  • థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు ₹25,000గా నిర్ణయించబడింది. ప్రతి లావాదేవీకి ₹25,000 వరకు నిర్వహించే ప్రతి లావాదేవీపై ₹150. ₹25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడం వీలు కాదు.
  • ఒక సంవత్సరంలో 25 చెక్కు లీఫ్స్ గల చెక్ బుక్ ఉచితం. 10 చెక్కు లీఫ్స్ గల అదనపు చెక్కు బుక్ కావాలంటే ₹20 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒక నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము రూ.150కు లోబడి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement