ATM transactions
-
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి మారనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, దేశీయ పొదుపు ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ ఛార్జీల గురించి ఈ క్రింద పేర్కొన్నాము. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి. 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) మాత్రమే ఉచితంగా లభిస్తాయి. మెట్రో నగరాలు కాకుండా ఇతర అన్ని ప్రాంతాల్లో మొదటి 5 లావాదేవీలు ఉచితం. ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. నాన్ హోమ్ బ్రాంచీలో రోజుకు ₹25,000 వరకు నిర్వహించే క్యాష్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ₹25,000 కంటే ఎక్కువ లావాదేవిలు జరిపితే ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు ₹25,000గా నిర్ణయించబడింది. ప్రతి లావాదేవీకి ₹25,000 వరకు నిర్వహించే ప్రతి లావాదేవీపై ₹150. ₹25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడం వీలు కాదు. ఒక సంవత్సరంలో 25 చెక్కు లీఫ్స్ గల చెక్ బుక్ ఉచితం. 10 చెక్కు లీఫ్స్ గల అదనపు చెక్కు బుక్ కావాలంటే ₹20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము రూ.150కు లోబడి ఉంటుంది. -
ఆగస్టు 1 నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు
ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీల చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ వర్తించనుంది. మెట్రో నగరాలలో ఉచిత లావాదేవీల సంఖ్య 3గా ఉంటే మెట్రో యేతర నగరాల్లో 5గా ఉంది. 2019 జూన్ లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులను చేశారు. ఏటీఎం లావాదేవీల ఇంటర్ చేంజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఏటీఎం ఛార్జీలు, ఫీజుల మొత్తం పరిధిని సమీక్షించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి, దేశంలో 115,605 ఆన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ టెల్లర్ యంత్రాలు ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
సాక్షి, ముంబై: అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లైనా డబ్బులను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లభించింది. వీటికి అదనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది. అంతేకాదు ఎస్ బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని ట్విటర్ వేదికగా ఎస్బీఐ ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..) Good news for all ATM card holders! SBI has decided to waive the ATM Service Charges levied on account of exceeding the number of free transactions, until 30th June.#SBI #Announcement #ATM #Transactions pic.twitter.com/d34sEy4Hik — State Bank of India (@TheOfficialSBI) April 15, 2020 -
ఏటీఎం లావాదేవీలు..ఆర్బీఐ వివరణ
సాక్షి, ముంబై: బ్యాంకు వినియోగదారులకు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఊరటనిచ్చింది. ప్రతినెలా బ్యాంకులు వినియోగదారులకు అందించే ఉచిత ఏటీఎం కోటాలో విఫలమైన లావాదేవీలను లెక్కించవద్దని ఆర్బీఐ బుధవారం బ్యాంకులను ఆదేశించింది. సాంకేతిక కారణాల వల్ల లావాదేవీలు విఫలం కావడం, నగదు లేక డబ్బు రాకపోవడం వంటి లావాదేవీలను కూడా బ్యాంకులు లెక్కలోకి తీసుకుంటున్నాయనే ఫిర్యాదులతో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఏటీఎంలో కరెన్సీ అందుబాటులో లేకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యే లావాదేవీలను చెల్లుబాటు అయ్యే లావాదేవీలుగా పరిగణించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్లనుంచి ఇందుకోసం ఎలాంటి ఛార్జీ వసూలు చేయరాదని ఆర్బీఐ ప్రకటన పేర్కొంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్-లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని వాణిజ్య బ్యాంకులకు కూడా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
బ్యాంకు చార్జీలకే 10వేల కోట్లు
పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకపోవడం, పరిమితికి మించిన ఏటీఎం లావాదేవీలు నిర్వహించడం వల్ల బ్యాంకులు ఖాతాదారుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.పది వేల కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకులు గత మూడున్నరేళ్లలో ఖాతాదారుల నుంచి ఈ సొమ్ము వసూలు చేశాయని, అయితే, ప్రైవేటు బ్యాంకులు ఇంకా భారీగానే రాబట్టి ఉంటాయని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటించింది. కనీస నిల్వ నిబంధనను ఎస్బీఐ 2012వ సంవత్సరంలో ఆపివేసింది. 2017 ఏప్రిల్ నుంచి మళ్లీ వసూలు చేయడం మొదలు పెట్టింది. మిగతా బ్యాంకులు కూడా అదేబాటను అనుసరిస్తున్నాయి. ఈ పదివేల కోట్లలో ఖాతాదారు అకౌంట్లో కనీస నిల్వ లేనందుకు రూ.6,246 కోట్లు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు జరిపినందుకు రూ.4,145 కోట్లు వసూలు చేశాయి. ఇందులో ఎస్బీఐ వాటా.. కనీస నిల్వకు సంబంధించి రూ.2,894 కోట్లు, ఏటీఎం లావాదేవీలకు సంబంధించి రూ.1,554 కోట్లు. జన్‌థన్ ఖాతాలకు, బేసిక్ పొదుపు ఖాతాలకు కనీస నిల్వ పరిమితి లేదు. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి మెట్రో నగరాల్లో నెలకు మూడు లావాదేవీలు(ఇతర బ్యాంకు ఏటీఎంలలో), మిగతా చోట్ల ఐదు లావాదేవీలు ఉచితం. ఈ పరిమితి దాటితే కనీసం రూ.20 చొప్పున ప్రతి లావాదేవీకి వసూలు చేస్తున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలలో ఉచిత లావాదేవీలు ఐదు వరకు చేసుకోవచ్చు. -
బ్యాంక్‌లు బంద్ ; ఏటీఎంలపై తీవ్ర ప్రభావం
-
బ్యాంకుల సమ్మె; ముందే జీతాలు వేసినా..
న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెల ముగింపు కావడంతో, ఉద్యోగుల వేతనాలు పడేది కూడా ఈ రోజుల్లోనే. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్ కాబట్టి, కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్ తమ ఉద్యోగుల వేతనాలను ఈ రోజే(మంగళవారమే) క్రెడిట్ చేసే అవకాశముంది. ఉద్యోగుల వేతనాలు నేడే క్రెడిట్ అయినప్పటికీ, వాటిని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా..ఈ బంద్ దెబ్బకొట్టనుంది. ఈ బంద్‌లో ఏటీఎం గార్డులు కూడా పాలుపంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలు మూతపడబోతున్నాయి. దీంతో వేతన విత్‌డ్రాయల్స్ కష్టతరంగా మారనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఏటీఎంలను నింపినప్పటికీ, ఏటీఎంల సెక్యురిటీ మాత్రం ప్రశ్నార్థకమే. దీంతో నగదు విత్‌డ్రాయల్స్‌లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో కస్టమర్లు భారీ ఎత్తున్న నగదు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ.. బ్యాంకు యూనియన్లు ఈ బంద్ చేపడుతున్నాయి. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. గత రెండు నుంచి మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జన్‌ధన్, డిమానిటైజేషన్, ముద్రా, అటల్ పెన్షన్ యోజన వంటి వాటిని ఎంతో కృతనిశ్చయంతో అమలు చేస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ల కన్వినర్ దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. 2017 నవంబర్ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. -
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
-
కస్టమర్లకు షాక్: సర్వీస్ చార్జ్ బాదుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటికే కస్టమర్లను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తున్న బ్యాంకులు ఇపుడు వారినెత్తిన మరో బాంబు వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అతి త్వరలో ఏటీఎం లావాదేవీలు, చెక్కుల జారీ, డెబిట్ కార్డుల లావాదేవీలు తదితర లావాదేవీల పై సర్వీస్ ఛార్జి విధించాలనే సంచలన నిర్ణయం దిశగా కదులుతున్నాయి. ప్రధానంగా ఇకపై ఉచిత సేవలపైన కూడా పన్నులు కట్టాలన్న జీఎస్టీ నోటీసుల నేపథ్యంలో ఇకపై ఉచిత సేవలకు శుభం కార్డు వేయనున్నాయని తెలుస్తోంది. మే నెలలో దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా బ్యాంకులు ఉచితంగా అందించిన సేవలకు కూడా.. సర్వీస్ ఛార్జీ వసూలు చేసినట్లు పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఎస్టీ) ఈ నోటీసులు అందించటం విశేషం. బ్యాంకులు ఉచితంగా అందించే సేవలపై.. సర్వీస్ ఛార్జీ విధిస్తున్నట్లుగా భావించి ఈ పన్నులు చెల్లించాలని జీఎస్టీ ఇంటలిజెన్స్ కోరింది. ఈ మేరకు ప్రధాన బ్యాంకులకు నోటీసులు అందాయి. అంతేకాదు ఈ సంవత్సరానికే కాకుండా.. గత ఐదేళ్లుగా ఖాతాదారులకు బ్యాంకులు అందించిన అన్ని ఉచిత సేవలపైనా ట్యాక్స్ కట్టాలని ఈ నోటీసుల్లో తెలిపింది. ఈ పన్నుల భారం మొత్తం విలువ సుమారు రూ.6వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే ఉచిత సేవలకు బదులు బ్యాంకులు ఇక సర్వీస్ చార్జీ బాదుడుకు తెర తీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు, చెక్ బుక్కుల జారీ, లావాదేవీలు, కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై సర్వీస్ ఛార్జీ భారం తప్పదంటున్నారు. ఇప్పటివరకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ఐసీఐసీఐ, యాక్సిస్, కొటక్ మహీంద్ర బ్యాంకులకు నోటీసులు అందాయి. త్వరలోనే ఇతర బ్యాంకులకు నోటీసులు అందే అవకాశం ఉంది. -
డెబిట్ కార్డులపై షాకిచ్చిన బ్యాంకులు
ముంబై : కేంద్ర ప్రభుత్వం ఓ వైపు నుంచి డెబిట్ కార్డు వాడకాన్ని పెంచుతూ ఉంటే.. మరోవైపు నుంచి బ్యాంకులు ఆ కార్డులకి షాక్‌లు ఇస్తున్నాయి. ఇష్టానుసారం డెబిట్ కార్డును వాడితే ఇక ఏ మాత్రం బ్యాంకులు ఊరుకోదలుచుకోవట్లేదు. అకౌంట్లో డబ్బు లేకపోయినా డ్రా చేయటానికి ప్రయత్నిస్తే.. అందుకనుగుణంగా ఛార్జీలు విధించేందుకు సిద్ధమయ్యాయి. కనీస నిల్వ లేకుండా డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే.. మీ బ్యాంకు అకౌంట్ నుంచి రూ.17 నుంచి రూ.25లను డెబిట్ చేస్తోంది. ఉదాహరణకు.. మీ బ్యాంక్ ఖాతాలో వెయ్యి రూపాయలే ఉన్నాయనుకుండి, ఒకవేళ మీరు 1,100 స్వైప్ చేస్తే.. సరైన నగదు నిల్వ లేదనే సమాచారం వస్తుంది. ఇక నుంచి దాంతో పాటు కనీస నిల్వ లేకుండా డబ్బులు డ్రా చేయటానికి ప్రయత్నించినందుకు గాను, ఛార్జీ కూడా బ్యాంకులు వసూలు చేయబోతున్నాయి. దీనిలోనే జీఎస్టీ రేటు కూడా అప్లయ్ అయి ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎం లేదా పాయింట్ ఆఫ్ సేల్ టర్మినల్ ద్వారా డెబిట్ కార్డు స్వైప్ ఫెయిల్ అయిన ప్రతీసారి రూ.17ను వసూలు చేయనుంది. అదేవిధంగా హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు రూ.25 ఛార్జీ వేయబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇలాంటి లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. కొంతమంది బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోకుండా.. డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారని బ్యాంకులు చెబుతున్నాయి. ఒకటికి రెండు సార్లు ఇలా డ్రా చేయడానికి ప్రయత్నిస్తుంటారని, ఇష్టానుసారం డెబిట్ కార్డులను వాడేస్తున్నారని పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత సిస్టమ్‌లో యాంటీ-డిజిటల్ ఎక్కువగా ఉందని, ఎక్కువ సేవింగ్స్ లేనివారికి ఇది అనవసరమైన రిస్క్ అని ఐఐటీ బొంబై ప్రొఫెసర్ అన్నారు. ఈ ఛార్జీలు డిజిటల్ పేమెంట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఒకవేళ డెబిట్ కార్డులు దుర్వినియోగమవుతున్నాయని బ్యాంకులు భావిస్తే, ఇలాంటి లావాదేవీలను నెలకు ఉచితంగా రెండు అందించాలని దాస్ అన్నారు. చెక్ బౌన్స్ ఛార్జీల కంటే ఇది చాలా చాలా తక్కువ అని మరోవైపు బ్యాంకులు చెబుతున్నాయి. ఇది న్యాయమైన నిర్ణయమేనని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి. -
కాస్ట్లీగా మారబోతున్న ఏటీఎం లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : సామాన్య ప్రజలపై మరో భారం పడబోతుంది. ఏటీఎం ఆపరేటర్లు, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం లావాదేవీల ఇంటర్-బ్యాంకు ఛార్జీలను పెంచాలని నిర్ణయిస్తున్నాయి. ఓ వైపు డిమానిటైజేషన్, మరోవైపు నిర్వహణ వ్యయాలు పెరుగడంతో, ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు పేర్కొన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విషయంపై వేరువేరుగా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో దీనిపై చర్చించినట్టు తెలిసింది. ఇంటర్ బ్యాంక్ ఛార్జీని ఓ బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎంలను వాడుకున్నందుకు ఆ బ్యాంకుకు విధిస్తారు. దీంతో చిన్న ఏటీఎం నెట్వర్క్స్ కలిగి ఉన్న బ్యాంకులకు భారంగా మారుతోంది. వ్యయాల భారం పెరిగిపోతుంది. దీంతో బ్యాంకులు వ్యయాల్లో కొంత భాగాన్ని వినియోగదారులకు తరలించాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇంటర్-బ్యాంకు ఫీజులను పెంచాలని కోరుతుండగా.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, ఒకవేళ ఇంకా వీటిని పెంచితే, తమ కట్టుబాట్లను కోల్పోతామని పేర్కొంటున్నాయి. ఫీజుల పెంపుకు మరో కారణం, ఏటీఎం కంపెనీలు ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతుండటం అని కూడా తెలుస్తోంది. డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగి, ఏటీఎం వాడకం భారీగా తగ్గిపోయింది. దీంతో ఏటీఎం కంపెనీలు ఒత్తిడిలో పడిపోయాయి. -
ఏటీఎం పరిమితుల అమలుకు బ్యాంకుల వెనుకంజ?
న్యూఢిల్లీ: మెట్రో నగరాల్లో సొంత కస్టమర్లకు ఏటీఎం లావాదేవీల పరిమితులపై బ్యాంకులు ఆలోచనలోపడ్డాయి. తమ సొంత కస్టమర్లకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితి విధింపును దిగ్గజ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు వంటివి ఇంకా ప్రకటించలేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఏటీఎంల వాడకంపై పరిమితి విధిస్తే.. బ్యాంకు బ్రాంచీల్లో కస్టమర్ల తాకిడి పెరిగిపోతుందనే ఆందోళనే దీనికి కారణమని ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి చెప్పారు. నగదు విత్‌డ్రాయల్స్ లేదా ఇతర సేవల కోసం బ్రాంచ్‌లకు కస్టమర్ పదేపదే రావడం వల్ల బ్యాంకులకు ఖర్చు కూడా ఎగబాకుతుందని... ఇది రూ.20 కంటే ఎక్కువే ఉంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌తో సహా ఆరు మెట్రోల్లో సొంత బ్యాంకులకు సంబంధించి నెలకు ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను ఐదుకు పరిమితం చేసేలా ఆర్బీఐ అనుమతించిన సంగతి తెలిసిందే. అదే ఇతర బ్యాంకుల ఏటీఎంల వాడకాన్ని ఇప్పుడున్న ఐదు నుంచి మూడు లావాదేవీలకు తగ్గించేందుకు ఓకే చెప్పింది. ఈ మార్పులు ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాలెన్స్ ఎంక్వయిరీ ఇతరత్రా ఏవైనాకూడా లావాదేవీల కిందే పరిగణిస్తారు. ఈ పరిమితి దాటితే ఒక్కో లావాదేవీకి రూ.20 చొప్పున ఫీజును బ్యాంకులు వసూలు చేసుకోవచ్చు. అయితే, సొంత బ్యాంకుల ఏటీఎంల విషయంలో నెలకు ఎన్ని ఉచిత లావాదేవీలను అనుమతించాలన్నది ఆయా బ్యాంకులే నిర్ణయించుకోవచ్చని ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అనవసరంగా ఖర్చును పెంచుకునే బదులు... బ్యాంకులు తమ సొంత కస్టమర్లకు నెలకు ఐదు కంటే ఎక్కువ సంఖ్యలో ఉచిత ఏటీఎం లావాదేవీలను అనుమతించే అవకాశం ఉందని.. ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఇతర బ్యాంకుల ఏటీఎం వాడకంపై పరిమితుల్ని మాత్రం అమలుచేస్తున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. గ్రామీణ బ్యాంకుల్లోనూ కేవైసీ కఠినం.. ఖాతాదారులు తమ చిరునామా ఇతరత్రా వివరాలకు(నో యువర్ కస్టమర్-కేవైసీ) సంబంధించి నిబంధనలను పాటించకపోతే వాళ్ల అకౌంట్లను పాక్షికంగా స్తంభింపజేయాలని రీజినల్ రూరల్ బ్యాంకులు, సెంట్రల్ కోపరేటివ్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆదేశించింది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకులకు ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.Follow @sakshinews