
ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి.
ఆర్‌బీఐ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీల చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ వర్తించనుంది. మెట్రో నగరాలలో ఉచిత లావాదేవీల సంఖ్య 3గా ఉంటే మెట్రో యేతర నగరాల్లో 5గా ఉంది. 2019 జూన్ లో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులను చేశారు. ఏటీఎం లావాదేవీల ఇంటర్ చేంజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఏటీఎం ఛార్జీలు, ఫీజుల మొత్తం పరిధిని సమీక్షించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి, దేశంలో 115,605 ఆన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ టెల్లర్ యంత్రాలు ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment