సాక్షి, ముంబై: అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరణ, లాక్‌డౌన్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లైనా డబ్బులను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లభించింది. వీటికి అదనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది. అంతేకాదు ఎస్ బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని ట్విటర్ వేదికగా ఎస్‌బీఐ ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..)
Good news for all ATM card holders!
SBI has decided to waive the ATM Service Charges levied on account of exceeding the number of free transactions, until 30th June.#SBI #Announcement #ATM #Transactions pic.twitter.com/d34sEy4Hik
— State Bank of India (@TheOfficialSBI) April 15, 2020
Comments
Please login to add a commentAdd a comment