Cheque book
-
ఇలాంటి చెక్కు వస్తే డబ్బు డ్రా చేసుకోలేరు..
దాదాపు అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. కానీ చెక్కులను పెద్దగా ఉపయోగించరు. వాటిలో చాలా మందికి వివిధ రకాల చెక్కుల గురించి తెలియదు . అటువంటి వాటిలో ఒకటే క్రాస్ చెక్ (Cross Cheque). ఇటాంటి చెక్ పై వైపున ఎడమ మూలలో రెండు గీతలు గీస్తారు. ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం క్రాస్ చెక్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం..నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (Negotiable Instruments Act)లోని సెక్షన్ 123 ప్రకారం.. ఇలాంటి చెక్ జారీ చేసిన వ్యక్తి ఇది క్రాస్డ్ చెక్ అని చెక్ ఎగువన ఎడమ మూలలో రెండు లైన్లతో బ్యాంక్‌కి సూచిస్తారు. ఈ రకమైన చెక్కుతో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకునేందుకు వీలుండదు. చెక్‌ను క్రాస్ చేయడం వలన నేరుగా డబ్బు విత్ డ్రా కాకుండా చెక్ పొందిన వ్యక్తి లేదా సూచించిన ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. దీని కోసం చెక్ వెనుక భాగంలోవారి సంతకం అవసరం.క్రాస్ చెక్ రకాలుఅయితే క్రాస్ చెక్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ క్రాసింగ్. అంటే ఇప్పటిదాకా చెప్పుకొన్న అంశాలన్నీ ఈ రకం కిందకు వస్తాయి. రెండోది ప్రత్యేక క్రాసింగ్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 124 ప్రకారం.. చెక్ గ్రహీత నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలోకి వెళ్లాలని డ్రాయర్ కోరుకున్నప్పుడు ప్రత్యేక క్రాసింగ్ చెక్‌ను జారీ చేస్తారు.ఉదాహరణకు గ్రహీత ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కలిగి ఉన్నట్లయితే, చెక్కు దిగువన ఉన్న పంక్తుల మధ్య దాని పేరును వ్రాయడం ద్వారా డ్రాయర్ బ్యాంక్‌ను పేర్కొనవచ్చు.ఇక చెక్‌పై క్రాసింగ్ లైన్ల మధ్య "అకౌంట్ పేయీ" అని రాసినట్లయితే, గ్రహీత మాత్రమే దాని నుండి డబ్బును విత్‌డ్రా చేయగలరని అర్థం. అయితే, ప్రత్యేక క్రాసింగ్‌తో నిర్దిష్ట బ్యాంకును పేర్కొన్నట్లయితే, డబ్బు ఆ బ్యాంకుకు మాత్రమే వెళ్తుంది. ఇది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో స్పష్టంగా పేర్కొననప్పటికీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank)తో సహా అనేక బ్యాంకులు దీనిని అనుసరిస్తున్నాయి.క్రాస్డ్ చెక్కులను ఎందుకు జారీ చేస్తారంటే..క్రాస్డ్ చెక్‌ల జారీ వెనుక ఉద్దేశం ఏమిటంటే, ఉద్దేశించిన గ్రహీత ఆ మొత్తాన్ని అందుకున్నారని నిర్ధారించుకోవడం. ఆ చెక్కు తప్పుడు చేతుల్లోకి వెళ్లినా.. అందులో నుంచి డబ్బులు తీసుకోలేరు. తద్వారా దాని భద్రతను (Cheque Security) పెంచుతుంది. -
అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్ బుక్‌లు పనిచేయవు
మీకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే, ఒక హెచ్చరిక. ఈ రెండు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్‌లు వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు. కాబట్టి ఈ బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. ఓబీసీ, యూబీఐ రెండూ ఏప్రిల్ 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు విలీనమైనప్పటికీ ఇప్పటి వరకు పాత బ్యాంకుల చెక్‌బుక్‌లనే కొనసాగించారు. ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు వీలైనంత త్వరగా పీఎన్బీ ఐఎఫ్ఎస్సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్బీ వన్ నుంచి వీటిని పొందొచ్చని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది. ఏదైనా సాయం లేదా క్వైరీ కొరకు కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800-180-2222ని సంప్రదించండి అని కూడా తెలిపింది.(చదవండి: భారీ లాభాలను గడించిన డ్రీమ్-11..! ఏంతంటే..?) -
చెక్ బుక్ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబందనలు చెక్ బుక్ లకు కూడా వర్తిస్తాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) రోజుకు 24 గంటలు పనిచేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబందనలు జాతీయ & ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయి. ఈ కొత్త నియమం వల్ల ఖాతాదారులు జారీ చేసిన చెక్కులు సెలవుదినాలలో కూడా సులభంగా క్లియర్ అవుతాయి. ఈ కొత్త నియమం వల్ల ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు చెక్ జారీ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిల్వ ఉంచాలి. అప్పుడే చెక్ సులభంగా క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు సెలవు దినాలు కదా అని సరిపడా నగదు నిల్వ చేయకపోతే మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మీరు జరిమానా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చెక్ బుక్ గల వినియోగదారులు సెలవుదినాల్లో కూడా ఎన్ఏసీహెచ్ పనిచేస్తుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఏసీహెచ్ అనేది ప్రాథమికంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ సీపీఐ) నిర్వహించే బల్క్ పేమెంట్ సీస్టమ్. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది. -
ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి మారనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, దేశీయ పొదుపు ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్ డ్రా, చెక్ బుక్ ఛార్జీల గురించి ఈ క్రింద పేర్కొన్నాము. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి. 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) మాత్రమే ఉచితంగా లభిస్తాయి. మెట్రో నగరాలు కాకుండా ఇతర అన్ని ప్రాంతాల్లో మొదటి 5 లావాదేవీలు ఉచితం. ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. నాన్ హోమ్ బ్రాంచీలో రోజుకు ₹25,000 వరకు నిర్వహించే క్యాష్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు లేవు. ₹25,000 కంటే ఎక్కువ లావాదేవిలు జరిపితే ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు ₹25,000గా నిర్ణయించబడింది. ప్రతి లావాదేవీకి ₹25,000 వరకు నిర్వహించే ప్రతి లావాదేవీపై ₹150. ₹25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడం వీలు కాదు. ఒక సంవత్సరంలో 25 చెక్కు లీఫ్స్ గల చెక్ బుక్ ఉచితం. 10 చెక్కు లీఫ్స్ గల అదనపు చెక్కు బుక్ కావాలంటే ₹20 చెల్లించాల్సి ఉంటుంది. ఒక నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత ప్రతి వెయ్యి రూపాయలకు ₹5 చెల్లించాల్సి ఉంటుంది. కనీస రుసుము రూ.150కు లోబడి ఉంటుంది. -
జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు. చదవండి: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్! -
వచ్చే నెలనుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమలు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం, మనీ విత్ డ్రా నియమ నిబంధనల్ని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనలు జులై నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎస్బీఐ వినియోగదారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడీ) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం విత్ డ్రాల్ ఛార్జీలు, చెక్‌బుక్‌లు ఆర్థికేతర టాన్సాక్షన్లపై ఈ కొత్త నిబంధనల్ని విధించనున్నారు. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే అదనపు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్ పై అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పేదలకు అండగా నిలిచేలా ఎస్బీఐ ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత వ్యక్తి కేవైసీ వివరాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ తో పాటు ఏటీఎం కార్డ్ ను ఉచితంగా పొందవచ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి బ్యాంక్ రూ.15 ప్లస్ జీఎస్టీని విధిస్తుంది. అయితే ఈ బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లకు ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ బుక్స్ ను బ్యాంక్ అందిస్తుంది. ఆ తరువాత నుంచి అందించే చెక్కులపై ఎస్బీఐ నిర్ధిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది. 10 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .40 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 25 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .75 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 10 ఎమర్జెన్సీ చెక్ బుక్ లకు రూ.50తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ లకు సంబంధించి కొత్త స్వరీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచ్ లేదంటే ఇతర బ్రాంచ్ లలో ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించరు. అంతేకాదు మనీ విత్ డ్రాల్ పరిమితిని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. "ఈ మహమ్మారి కారణంగా వినియోగదారులకు అండగా నిలిచేందుకు మనీ విత్ డ్రాల్ ను పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బీ ఐ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ఇటీవల ఎస్ బీ ఐ చెక్ ద్వారా రోజుకు 1లక్ష నగదును డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు విత్ డ్రాల్ ఫాం ద్వారా ప్రతిరోజు రూ.25,000 వేలు డ్రా చేసుకోవచ్చు. చెక్ ద్వారా మనీ విత్ డ్రాల్ ను నెలకు రూ.50,000గా నిర్ణయించింది. చదవండి : ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట -
నకిలీ చెక్కుతో రూ.45 లక్షల మోసం
సాక్షి, చెన్నై : నకిలీ చెక్‌తో రూ.45 లక్షల మేరకు మోసగించిన మేనేజర్ సహా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టి నగర్‌లోని తాంబరం శానటోరియం జీఎస్ రోడ్డులోని ప్రముఖ నగల దుకాణంలో పార్థీబన్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నగల దుకాణం తరఫున తాంబరం పోలీసు స్టేషన్లో ఒక ఫిర్యాదు అందింది. అందులో గత ఏడాది డిసెంబర్లో నగల దుకాణంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసిన పార్థీబన్, వెంకటేశన్, నమ్మాళ్వార్ నకిలీ చెక్కు ఉపయోగించి రూ.45 లక్షల మేరకు నగల మోసానికి పాల్పడినట్లు తెలిపారు. దీనిపై శుక్రవారం పోలీసులు విచారణ జరపగా నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అజ్ఞాతంలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని.. టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.75 లక్షలు మోసగించిన దిండుగల్ జిల్లా ట్రెజరీ కార్యాలయ ఉద్యోగిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా, జలకంఠాపురానికి చెందిన సిద్ధురాజ్ (35). ఇతని భార్య రేవతి (30). అదే ప్రాంతానికి చెందిన కార్తి, జయలక్ష్మి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. వీరి బంధువు ఒకరు దిండుగల్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలుసని, వారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో చేరవచ్చని నమ్మబలికారు. దీన్ని నమ్మిన సిద్ధురాజ్ మరో ముగ్గురు దిండుగల్ జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సహాయకునిగా పనిచేస్తున్న కరుప్పయ్య (54) నలుగురు కలిసి రూ.6.75 లక్షలను అందజేశారు. అయితే అతను ఉద్యోగాలు ఇప్పించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో వారు నగదు తిరిగివ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో నలుగురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కరుప్పయ్యను అరెస్టు చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు సేలం జైలులో నిర్బంధించారు. -
కొందరికే.. పెట్టుబడి
సాక్షి, జనగామ: యాసంగి పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. మొదటి దఫా డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ అధికారులు జమ చేశారు. మొదటి దఫాలో కేవలం 3,915 మంది రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ చేశారు. రెండో విడత చెల్లింపు ల కోసం రైతుల ఖాతా నంబర్లు సేకరిస్తున్నారు. ముం దస్తు ఎన్నికల నేపథ్యంలో రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నగదు రూపంలో చెల్లిం చడానికి వీలులేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిం ది. దీంతో చెక్కుల రూపంలో కాకుండా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సా యం జమ చేయాలని సూచించడంతో ఈ మేరకు అధికా రులు చెల్లింపుల ప్రక్రియను చేపట్టారు. తొలి విడతలో రూ.4.65 కోట్లు జమ.. ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడానికి రైతుబంధు పథకానికి ప్రభుత్వం శ్రీకా రం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో తొలివిడత రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. రెండో పంటకు అక్టోబర్‌లో చెక్కులను అందించాల్సి ఉండగా ఇంతలో శాసనసభను రద్దు చేశారు. ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతుండడంతో రైతుబంధు చెక్కులను పంపిణీని నిలిపివేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేరుగా రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి దఫాలో 13 మండలాల్లోని 3,915 మంది రైతులకువారి అకౌంట్లలో రూ.4,65,69,240 ను జమ చేశారు. రెండో విడతలో రూ.26.82 కోట్లు..మొదటి దఫాలో తక్కువ మంది రైతులకే పెట్టుబడి సాయం జమ చేశారు. నవంబర్ మొదటివారంలో రెండో దఫా పెట్టుబడి సాయాన్ని జమ చేయనున్నారు. ఇందులో 22,109 మంది రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వారికి రూ.26,82,52,460 చెల్లించనున్నారు. అకౌంట్ల సేకరణకు ఇక్కట్లు.. రైతుల బ్యాంకు అకౌంట్ల సేకరణలో అధికారులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలోని 68 క్లస్టర్లల్లో ఏఈఓలు ఇంటింటా రైతు వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా, మండలం, గ్రామం, రైతు పేర్లతోపాటు ఆధార్ నంబర్, బ్యాంకు, బ్రాంచి, అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్‌లతోపాటు 9 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఏఈఓలు గ్రామాలకు వెళ్తున్నప్పటికీ రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాలు సేకరించలేక పోతున్నారు. ఖరీఫ్‌లో 6,829 చెక్కులు వాపస్.. జిల్లావ్యాప్తంగా 1,54,658 చెక్కులు రైతుల పేరుమీద వచ్చాయి. అయితే వివిధ కారణాలతో ప్రభుత్వం తిరిగి 6,829 చెక్కులను తీసుకుంది. మిగతా 1,47,823 చెక్కుల్లో 1,32,870 చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 75 వేల మంది రైతుల ఖాతాలను సేకరించారు. మరో 50 వేల మంది రైతుల వివరాలు తీసుకోవాల్సి ఉంది. రైతుల వివరాలు లేకపోతే రైతుబంధు సాయాన్ని జమ చేయడం మరింత ఆలస్యం కానుంది. 75 వేల ఖాతాలను సేకరించాం యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మొదటి విడత రైతుల అకౌంట్లలో జమ చేశాం. రెండో విడత కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు 75 వేల అకౌంట్లను సేకరించాం. మిగతా రైతుల వివరాలను సేకరిస్తున్నాం. అందరికి డబ్బులు వచ్చేలా ప్రయత్నిస్తాం. –ఎన్.వీరూనాయక్, డీఏఓ -
వారికి రైతు...బంధు
సాక్షి, మెదక్‌జోన్: వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కారించేందుకు ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేలాది మంది అన్నదాతలకు నిరాశే మిగుల్చుతోంది. జిల్లాలోని 44,932 ఎకరాల భూముల పలు సమస్యల్లో ఉన్నాయి. సమస్యాత్మక భూములను పార్ట్ బీలో ఉంచడంతో ఈ భూముల రైతులు ఖరీఫ్‌లో పంపిణీ చేసిన సాగు పెట్టుబడి సాయం(రైతుబంధు) అందలేదు. ప్రస్తుతం రబీ సీజన్‌కు మళ్లీ పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు రైతుల అకౌంట్ నంబర్లను సేకరిస్తున్నారు. కానీఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం కొత్త వారికి రైతుబంధు ఇవ్వరాదనే నిబంధనతో సమస్యలు తీరిన రైతులకు సైతం రబీలో రైతుబంధు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఇక సమస్యలు పరిష్కారం కాని రైతుల పరిస్థితి ఇంకా ఇబ్బందిగా మారింది. భూ సమస్య పరిష్కారం కాకపోగా రైతుబంధు రాని దుస్థితి. జిల్లాలో 3.20 లక్షల ఎకరాలు భూమి ఉండగా 25వేలకు పైగా ఎకరాల భూములు సమస్యల్లో ఉన్నాయి. ప్రధానంగా అటవీ భూములని ఫారెస్ట్ అధికారులు రైతులు సాగు చేసుకునే వేలాది ఎకరాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి భూములను జాయింట్ సర్వే పేరుతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తున్నారు. అలాగే అనేక గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న భూములతో పొలిస్తే రికార్డుల్లో మూడింతలు ఎక్కువగా ఉండడం వల్ల వాటి లెక్కలను తెల్చేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి భూములు చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, ఎస్. కొండాపూర్, హవేళిఘణాపూర్ మండలంలోని బూర్గుపల్లి, లింగ్సాన్‌పల్లి తండా, గాజిరెడ్డిపల్లి, దూప్‌సింగ్, అల్లాదుర్గం తదితర మండలాల్లో సమస్యలు కొకల్లలుగా ఉన్నాయి. వీటిని పరిష్కారించేందుకు అధికారులు అడపదడపా సర్వేలు చేపడుతున్నప్పటికీ ఇవి నేటికీ కొలిక్కి రావడం లేదు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభించి ఏడాది కావస్తున్న ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ సొమ్మును ప్రస్తుత రబీ సీజన్లో నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు రైతుల అకౌంట్ నంబర్లను సేకరిస్తున్నారు. 1.90 లక్షల చెక్కుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన 6.6 శాతం భూముల సమస్యలు పరిష్కరించాల్సింది. ఖరీఫ్‌కు ముందు 1.90 లక్షల చెక్కుల రూపంలో రూ. 140 కోట్లను అందజేశారు. ఇందులో చనిపోయిన రైతులు, విదేశాల్లో ఉన్న రైతులతో పాటు తక్కువ భూమి ఉన్న తదితర రైతులు 26వేల చెక్కులు మిగిలిపోయాయి. వాటికి సంబంధించి సుమారు రూ. 18 కోట్లు మిగిలినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన చెక్కులను ప్రభుత్వానికి తిరిగి పంపించారు. ప్రస్తుత రబీ సీజన్లో సమస్యల్లో ఉన్న భూములను వదిలేసి ఖరీఫ్‌లో చెల్లించిన మాదిరిగానే రబీలోనూ రైతుబంధు పెట్టుబడి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తమ సమస్యలు ఇంకెన్నాళ్లకు పరిష్కారిస్తారంటూ చెక్కులందని బాధిత రైతులు ప్రభుత్వంపై గుర్రుమీద ఉన్నారు. అయోమయ పరిస్థితి.. వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కరించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభిం చి ఏడాది పూర్తయిం ది. సర్వేలు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. మా గ్రామంలో 500 ఎకరాల్లోని భూములు మూడు సర్వే నంబర్లతో ఉన్నాయి. నాకు అందులో రెండు ఎకరాల భూ మి ఉంది. రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉందని నాకు ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కు ఇవ్వలేదు. ఇప్పుడైనా చెక్కు ఇస్తారో?... ఇవ్వరో? తెలియని అయోమయ పరిస్థితి. –కుమ్మరి సిద్దిరాములు, జంగరాయి పార్ట్–బీ భూములకు సాయం లేదు.. సమస్యల్లో ఉన్న భూములు 44,932 ఎకరాలున్నాయి. ఈ భూములను సర్వే చేయిస్తున్నాం. వీటిలో ముఖ్యంగా అటవీ భూములున్నట్లు ఆ శాఖాధికారులు చెప్పడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వేలు ప్రారంభించాం. అలాగే కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో భూములు తక్కువ ఉండి రికార్డుల్లో మాత్రం మూడింతలుగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి భూములను పార్ట్–బీలో పొందుపర్చాం. రబీలోనూ ఈ భూములకు పెట్టుబడి సాయం లేదు. వీటి సమస్యలు పూర్తిగా పరిష్కారించాక నూతన పాస్‌బుక్‌లు అందజేసిన అనంతరం పెట్టుబడి సాయం అందుతుంది. –నగేశ్, జాయింట్ కలెక్టర్ -
ఖాతాల్లోకే ‘రైతుబంధు’
సాక్షి, మెదక్‌జోన్: రైతులకు సాగు పెట్టుబడి కోసం ప్రత్యేకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా 5వ తేదీ నుంచి జిల్లాలో చెక్కుల పంపిణీని ప్రారంభించారు. తూప్రాన్, కౌడిపల్లి, నర్సాపూర్, నిజాంపేట, తదితర మండలాల్లో కొంతమందికి పంపిణీ చేశారు. కాగా అదే రోజు ఎన్నికల కోడ్ రావడంతో చెక్కుల పంపిణీని నిలిపివేశారు. కానీ నేరుగా గ్రామాల్లోకి వెళ్లి రైతులకు చెక్కుల పంపిణీ చేయటాన్ని నిలిపివేయాలన్న ఎన్నికల కమిషన్ నేరుగా రైతు అకౌంట్లో పెట్టుబడి సాయం వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు రూ. 4 వేల చొప్పున నేరుగా ఆయా రైతుల అకౌంట్లోకే డబ్బులను వేసేందుకు అధికారులు సిద్ధమౌతున్నారు. ఇందుకోసం రైతుల పేర్లు, ఎంత భూమి ఉంది? అకౌంట్ నంబర్లను తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎలాంటి అర్భాటం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బులను డ్రా చేసుకునే వీలు ఉంటోందని అధికారులు ఆలోచన. 2.20 లక్షల మంది రైతులకు లబ్ధి రబీ సీజన్‌కోసం పెట్టుబడి సాయం కింద జిల్లాలో 2.20 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇందుకోసం రూ. 140 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. రబీ ప్రణాళికను సైతం ఇప్పటికే వ్యవసాయశాఖ అ«ధికారులు సిద్ధం చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తదితర వాటిని అందుబాటులో ఉంచామని వివరిస్తున్నారు. ఈ నెలలో పంపిణీ చేస్తే ముందుగా సన్నద్ధమై సాగుచేసుకునేందుకు వీలు ఉంటోంది. అప్పు కింద పట్టుకుంటారా..? రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేస్తే పంట రుణాలకు సంబంధించి పట్టుకుంటారని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 95 శాతం మంది రైతులు బ్యాంకు అధికారులకు అప్పులే ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు అధికారులు పట్టుకుంటే తమ పరిస్థితి ఏంటని పలువురు రైతులు వాపోతున్నారు. అదే జరిగితే ప్రభుత్వం తమకు ఇచ్చిన పెట్టుబడి అక్కరకు రాకుండా పోతుందని వారు బావిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులకు సరైన సూచనలు ఇస్తేనే బాగుంటుందని అన్నదాతలు కోరుతున్నారు. ఖరీఫ్‌లో మిగిలిన చెక్కులు ప్రభుత్వం ఖరీఫ్ సీజన్లో పంపిణీ చేయగా జిల్లా వ్యాప్తంగా 26 వేల చెక్కులు మిగిలిపోయాయి. ఈ చెక్కులు పట్టాదారులకు తప్ప కుటుంబీకులకు కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలో ఖరీఫ్ సిజన్లో జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలకుగాను 2.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎన్ఆర్ఐలకు సంబంధించిన చెక్కులు, చనిపోయినవారి చెక్కులు, కొద్ది పాటి అమౌంట్ ఉన్న చెక్కులు మిగిలిపోయాయి. వీటిని తిరిగి ప్రభుత్వానికి పంపించారు. అలా కాకుండా అందుబాటులో లేని రైతుల చెక్కులను సంబంధిత కుటుంబీకులకు అందజేస్తే ఉపయోగకరంగా ఉంటోందని రైతులు సూచిస్తున్నారు. ఖాతా నంబర్లు ఇవ్వాలి.. పెట్టుబడి సాయానికి సంబంధించి చెక్కుల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో అందుబాటులో లేని రైతులకు సైతం పెట్టుబడి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ సంబంధిత రైతు బ్యాంకు ఖాతాను తప్పని సరిగా అందించాల్సి ఉంది. పరుశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
‘చెక్కు’చెదరదు
సాక్షి,న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం త్వరలో చెక్‌బుక్‌లను ఉపసంహరించుకుంటుందన్న ప్రచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు చెక్ బుక్‌లను ఉపసంహరిస్తారన్న వార్తలు మీడియాలో వచ్చాయని, దీన్ని ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చిందని, అలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చెక్‌బుక్ సదుపాయాన్ని ఉపసంహరిస్తుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఇటీవల పేర్కొన్న క్రమంలో ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.నగదు లావాదేవీలను వీలైనంత తగ్గించేందుకు ప్రభుత్వం భారీ లక్ష్యాలనే తలకెత్తుకుంది. నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగినా క్రమంగా నగదు లభ్యత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. -
ఇక కోటి పైగా చెక్ బౌన్స్ అయినా.. కొత్త చెక్ బుక్!
ముంబై : చెక్‌బుక్ జారీ నిబంధనలను ఆర్బీఐ సడలించింది. దీనిప్రకారం.. కోటి పైబడిన చెక్ బౌన్స్ జరిగినా కస్టమర్‌కు, కొత్త చెక్ బుక్ జారీ చేసే నిర్ణయాధికారాన్ని ఇకపై బ్యాంకింగ్ కలిగి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం నాలుగుసార్లు ‘తగిన నిధులు లేక’ చెక్ బౌన్స్ సంభవించి, ఆ మొత్తమూ రూ.కోటి, ఆపైబడి ఉంటే, సంబంధిత కరెంట్ అకౌంట్ హోల్డర్‌కు కొత్త చెక్కు జారీ చేసే అధికారం బ్యాంకింగ్‌కు లేదు. ఇలాంటి సందర్భాల్లో అసలు అకౌంట్ క్లోజ్ చేసే అధికారమూ బ్యాంకింగ్‌కు ఉంటుంది. అయితే ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశాన్ని బ్యాంక్ బోర్డ్ లేదా కమిటీ నిర్ణయం తీసుకోవాలనీ ఆర్బీఐ తన తాజా నోటిఫికేషన్లో సూచించింది. ఈ మేరకు స్వయంగా నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది.