దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం, మనీ విత్ డ్రా నియమ నిబంధనల్ని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనలు జులై నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎస్‌బీఐ వినియోగదారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడీ) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం విత్ డ్రాల్ ఛార్జీలు, చెక్‌బుక్‌లు ఆర్థికేతర టాన్సాక్షన్లపై ఈ కొత్త నిబంధనల్ని విధించనున్నారు.
ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే ఏమిటి?
ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే అదనపు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్ పై అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పేదలకు అండగా నిలిచేలా ఎస్‌బీఐ ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత వ్యక్తి కేవైసీ వివరాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ తో పాటు ఏటీఎం కార్డ్ ను ఉచితంగా పొందవచ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి బ్యాంక్ రూ.15 ప్లస్ జీఎస్టీని విధిస్తుంది. అయితే ఈ బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లకు ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ బుక్స్ ను బ్యాంక్ అందిస్తుంది. ఆ తరువాత నుంచి అందించే చెక్కులపై ఎస్‌బీఐ నిర్ధిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది.
- 10 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .40 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది.
- 25 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .75 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది.
- 10 ఎమర్జెన్సీ చెక్ బుక్ లకు రూ.50తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ లకు సంబంధించి కొత్త స్వరీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది.
అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచ్ లేదంటే ఇతర బ్రాంచ్ లలో ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించరు. అంతేకాదు మనీ విత్ డ్రాల్ పరిమితిని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. "ఈ మహమ్మారి కారణంగా వినియోగదారులకు అండగా నిలిచేందుకు మనీ విత్ డ్రాల్ ను పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బీ ఐ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ఇటీవల ఎస్ బీ ఐ చెక్ ద్వారా రోజుకు 1లక్ష నగదును డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు విత్ డ్రాల్ ఫాం ద్వారా ప్రతిరోజు రూ.25,000 వేలు డ్రా చేసుకోవచ్చు. చెక్ ద్వారా మనీ విత్ డ్రాల్ ను నెలకు రూ.50,000గా నిర్ణయించింది.
చదవండి : ఎస్‌బీఐ ఖాతాదారులకు ఊరట
Comments
Please login to add a commentAdd a comment