accountholders
-
వాట్సాప్ యూజర్లకు షాక్.. 75 లక్షల అకౌంట్స్ బ్యాన్
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ (WhatsApp) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 ప్రకారం.. భారతదేశంలో సుమారు 75 లక్షల కంటే ఎక్కువ నకిలీ అకౌంట్స్ నిషేదించింది. 2023 అక్టోబర్ 01 నుంచి 31 మధ్య 7548000 ఖాతాలను నిషేదించింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వాట్సాప్ నెలవారీ నివేదికలో వివరించిన విధంగా.. 19,19,000 వినియోగదారు నివేదికల కంటే ముందుగానే నిషేధించడం జరిగింది. అక్టోబర్‌లో దేశంలో రికార్డు స్థాయిలో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు సమాచారం. ఇందులో ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించబడిన ఖాతాను పునరుద్ధరించడం వంటివి ఉన్నాయి. దేశంలో 500 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న వాట్సాప్ అక్టోబర్‌లో 9,063 ఫిర్యాదులను అందుకున్నట్లు.. వీటిపైన 12 చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే వాట్సాప్ ఒక ఖాతాను నిషేధించడం లేదా గతంలో నిషేధించిన దాన్ని పునరుద్ధరించడం వంటి పరిష్కార చర్యలను సూచిస్తుంది. వినియోగదారు ఫిర్యాదులకు సంబంధించిన సమగ్ర వివరాలను పరిగణలోకి తీసుకుని, దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి సరైన చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సైబర్‌ట్రక్ లాంచ్ చేసిన టెస్లా - ధర ఎంతంటే? వాట్సాప్ సెప్టెంబర్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 30 వరకు మొత్తం 7,111,000 ఖాతాలను బ్యాన్ చేసింది. ఇందులో వినియోగదారు నివేదికలను స్వీకరించడానికి ముందు 2,571,000 ఖాతాలు ముందస్తుగా నిషేధించారు. అప్పుడు వచ్చిన ఫిర్యాదుల్లో అకౌంట్ సపోర్ట్ (1,031), బ్యాన్ అప్పీల్ (7,396), అదర్ సపోర్ట్ (1,518), ప్రొడక్ట్ సపోర్ట్ (370), సేఫ్టీ (127) వంటి కేటగిరీల్లో 10,442 యూజర్ రిపోర్ట్‌లను స్వీకరించినట్లు సమాచారం. -
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్, డబ్బులు డిడక్ట్ అవుతున్నాయని మెసేజ్ వచ్చిందా!
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఖాతాదారుల బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్‌లు వెళుతున్నాయి. అయితే తాము ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా డబ్బులు ఎందుకు డెబిట్ అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అవ్వడంపై ఖాతాదారులు కంగారు పడాల్సిన అసవరం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్యాలెన్స్ మెయింటెన్స్/ సర్వీస్ ఛార్జీలు పేరుతో ఖతా నుంచి రూ.147.50 డబ్బుల్ని డెబిట్ చేస్తున్నట్లు తెలిపారు. నాన్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు చేసి, ఆ ట్రాన్స్‌క్షన్‌ల లిమిట్ దాటిపోతే అదనపు ఛార్జీల వసూళ్లు సర్వసాధారణమని బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్బీఐ తన కస్టమర్లు ఉపయోగించే డెబిట్ కార్డ్‌ల యాన్యువల్ ఫీ రూ.125 ఉండగా..అదనంగా 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తుంది. దీంతో రూ.125కి జీఎస్టీ కలిపితే రూ.147.50కి అవుతుంది. ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ వివిధ క్రెడిట్ కార్డ్ సంబంధిత లావాదేవీలపై విధించే అదనపు ఛార్జీలను సవరించింది. ఎస్బీఐ కార్డ్ తన వెబ్సైట్లో నవంబర్ 15, 2022 నుంచి అన్ని అద్దె చెల్లింపు లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము రూ.99 ప్లస్ జీఎస్టీ విధిస్తున్నట్ల పేర్కొంది. నాటి నుంచి అన్ని మర్చంట్ ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ రుసుము రూ.199కి సవరించింది. -
పోస్ట్‌మాస్టర్ యవ్వారం.. ఐపీఎల్ బెట్టింగ్‌లో కోటి లాస్.. అంతా మంది సొమ్మే!
భోపాల్: తేరగా వచ్చే డబ్బును అనుభవించాలనుకుంటే.. ఆ కర్మఫలితాన్ని కూడా తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. మంది సొమ్ముతో ఐపీఎల్లో బెట్టింగ్ వేయడమే కాదు.. ఆ సొమ్మంతా పొగొట్టి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు ఓ పోస్ట్‌మాస్టర్. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బినా సబ్ పోస్ట్ ఆఫీస్‌లో విశాల్ అహిర్వార్ పోస్ట్‌మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగులు పెడుతున్నాడు అతను. ఈ క్రమంలో దాదాపు కోటి రూపాయలకు పైనే పొగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బంతా మంది సొమ్మని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సుమారు 24 కుటుంబాలకు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును ఐపీఎల్లో బెట్టింగ్ కోసం వాడుకున్నాడు. విశాల్ చేసిన మోసం వెలుగులోకి రావడంతో మే 20న బినా గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన తప్పును ఒప్పుకున్నాడు అతను. నిందితుడు పోస్ట్‌మాస్టర్ నకిలీ ఎఫ్డి ఖాతాల కోసం నిజమైన పాస్‌బుక్‌లను జారీ చేశాడని, గత రెండేళ్ల నుండి ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం డబ్బును పెట్టినట్లు పోలీసులు తెలిపారు. చీటింగ్, ఖాతాదారులను మోసం చేయడం సెక్షన్ల కింద విశాల్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. -
ఎస్బీఐ ‘బేసిక్’ కస్టమర్లకు షాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు (బీఎస్‌బీడీ) షాకిచ్చింది. ఇకపై ఏటీఎం నుంచైనా, శాఖ నుంచైనా నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు నెలలో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా ఉంటాయని వెల్లడించింది. అలాగే, ఏడాదికి 10 చెక్ లీఫ్లకు మించి తీసుకుంటే కూడా అదనంగా చార్జీలు వర్తిస్తాయని తెలిపింది. ఈ పరిమితి దాటితే ‘అదనపు విలువ ఆధారిత సర్వీసులు అందించినందుకు‘ గాను రూ. 15 నుంచి రూ. 75 దాకా చార్జీలు వర్తిస్తాయని ప్రకటించింది. బీఎస్‌బీడీ ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఈ మేరకు సవరించింది. వీటి ప్రకారం .. ఎస్బీఐ శాఖలు, ఏటీఎంలు లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి 4 ఉచిత నగదు విత్‌డ్రాయల్ లావాదేవీలు దాటితే రూ. 15 చార్జీలతో పాటు జీఎస్టీ అదనంగా వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. జూలై 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఆర్థికేతర లావాదేవీలు, ట్రాన్స్ఫర్ లావాదేవీలు మాత్రం శాఖలు, ఏటీఎం, సీడీఎం (క్యాష్ డిస్పెన్సింగ్ మెషీన్ల)లలో ఉచితంగానే ఉంటాయని ఎస్బీఐ వివరించింది. అటు చెక్ బుక్ సర్వీసులకు సంబంధించి.. ఒక ఆర్థిక సంవత్సరంలో పది చెక్ లీఫ్లు ఉచితంగా ఉంటాయని తెలిపింది. అది దాటితే.. 10 లీఫ్ల చెక్ బుక్కు రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ. 75 చార్జీలు వర్తిస్తాయి. వీటికి జీఎస్టీ అదనం. ఇక అత్యవసర చెక్ బుక్ కోసం రూ. 50 (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్ కస్టమర్లకు మాత్రం చెక్ బుక్ సేవల పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది. కస్టమర్ వివరాల ధ్రువీకరణ నిబంధనలకు (కేవైసీ) లోబడి ఎవరైనా బీఎస్‌బీడీ ఖాతా తీసుకోవచ్చు. ప్రధానంగా ఎలాంటి చార్జీలు, ఫీజుల భారం పడకుండా బడుగు, బలహీన వర్గాలను పొదుపు వైపు మళ్లించేందుకు ఈ ఖాతాలను ఉద్దేశించారు. ఐఐటీ–బాంబే ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2015–20 మధ్య కాలంలో 12 కోట్ల బీఎస్‌బీడీ ఖాతాలపై సర్వీసు చార్జీలు విధించడం ద్వారా కస్టమర్ల నుంచి ఎస్బీఐ ఏకంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది. చదవండి: Senior Citizens: బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్...! -
వచ్చే నెలనుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమలు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం, మనీ విత్ డ్రా నియమ నిబంధనల్ని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనలు జులై నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎస్బీఐ వినియోగదారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడీ) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం విత్ డ్రాల్ ఛార్జీలు, చెక్‌బుక్‌లు ఆర్థికేతర టాన్సాక్షన్లపై ఈ కొత్త నిబంధనల్ని విధించనున్నారు. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే అదనపు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్ పై అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పేదలకు అండగా నిలిచేలా ఎస్బీఐ ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత వ్యక్తి కేవైసీ వివరాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ తో పాటు ఏటీఎం కార్డ్ ను ఉచితంగా పొందవచ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి బ్యాంక్ రూ.15 ప్లస్ జీఎస్టీని విధిస్తుంది. అయితే ఈ బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లకు ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ బుక్స్ ను బ్యాంక్ అందిస్తుంది. ఆ తరువాత నుంచి అందించే చెక్కులపై ఎస్బీఐ నిర్ధిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది. 10 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .40 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 25 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .75 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 10 ఎమర్జెన్సీ చెక్ బుక్ లకు రూ.50తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ లకు సంబంధించి కొత్త స్వరీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచ్ లేదంటే ఇతర బ్రాంచ్ లలో ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించరు. అంతేకాదు మనీ విత్ డ్రాల్ పరిమితిని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. "ఈ మహమ్మారి కారణంగా వినియోగదారులకు అండగా నిలిచేందుకు మనీ విత్ డ్రాల్ ను పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బీ ఐ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ఇటీవల ఎస్ బీ ఐ చెక్ ద్వారా రోజుకు 1లక్ష నగదును డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ పాస్‌బుక్‌తో పాటు విత్ డ్రాల్ ఫాం ద్వారా ప్రతిరోజు రూ.25,000 వేలు డ్రా చేసుకోవచ్చు. చెక్ ద్వారా మనీ విత్ డ్రాల్ ను నెలకు రూ.50,000గా నిర్ణయించింది. చదవండి : ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట -
పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా!
ముంబై: ముంబై కేంద్రంగా, పలు రాష్ట్రాల్లోని పట్టణాల్లో కార్యకలాపాలు నిర్వహించే.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలు విధిస్తూ ఆర్బీఐ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్బీఐ గుర్తించి ఈ చర్యలకు దిగింది. వచ్చే ఆరు నెలల పాటు ఒక్కో కస్టమర్ కేవలం రూ.1,000 మాత్రమే తన ఖాతా నుంచి (సేవింగ్స్/కరెంటు/డిపాజిట్ ఖాతా) ఉపసంహరించుకోవడానికి(విత్‌డ్రా) అనుమతిం చింది. తన అనుమతి లేకుండా కొత్తగా రుణాలను మంజూరు చేయడం కానీ, ప్రస్తుత రుణాలను పునరుద్ధరించడం కాని చేయరాదని ఆంక్షలు పెట్టింది. అలాగే, కొత్తగా పెట్టుబడులు పెట్టకుండా, ప్రజల నుంచి డిపాజిట్లు సమీకరించకుండా, తన ఆస్తులను విక్రయించకుండా ఆర్బీఐ నిషేధించింది. ప్రస్తుత బోర్డును ఆర్బీఐ రద్దు చేయడంతోపాటు తన అధికారుల బృందంతో మంగళవారం నుంచి బ్యాంకు పుస్తకాల తనిఖీని కూడా చేపట్టింది. తన చర్యలను బ్యాంకు లైసెన్స్ రద్దు చేయడంగా పరిగణించొద్దని ఆర్బీఐ కోరింది. ఎన్పీఏలు డబుల్ డిజిట్ స్థాయిలో ఉన్నా కానీ, పీఎంసీ చాలా తక్కువగా వాటిని చూపిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షిస్తుంటుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో... పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షల వెనుక ప్రధాన కారణం బ్యాంకు పుస్తకాల్లో ఎన్పీఏలు అధికంగా ఉండడం వల్లేనని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్యాంకు యాజమాన్యమే పుస్తకాల ప్రక్షాళనకు ముందుకు వచ్చిందని, దీంతో బ్యాంకు కార్యకలాపాలు సాఫీగా నడిచేందుకు ఆర్బీఐ ఆంక్షలను విధించినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2019 మార్చితో ముగిసిన ఆరి్థక సంవత్సరంలో పీఎంసీ నికర లాభం కేవలం 1.20 శాతమే తగ్గి రూ.99.69 కోట్లుగా ఉంది. నికర ఎన్పీఏలు మాత్రం మొత్తం రుణాల్లో 1.05 శాతం నుంచి 2.19 శాతానికి పెరిగాయి. స్థూల ఎన్పీఏలు మొత్తం రుణాల్లో 3.76 శాతంగా ఉన్నాయి. ఇది అధికారికంగా చూపించింది. కానీ, ఇంతకంటే ఎక్కువే ఎన్పీఏలు ఉన్నాయన్నది తాజా సమాచారం. పట్టణ కోఆపరేటివ్ బ్యాంకు అయిన పీఎంసీ వద్ద 2019 మార్చి నాటికి రూ.11,167 కోట్ల ప్రజల డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకు మంజూరు చేసిన రుణాలు రూ.8,383.33 కోట్లు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, గోవా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పట్టణాల్లో మొత్తం 137 శాఖలు ఈ బ్యాంకు పరిధిలో ఉన్నాయి. పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలను ఆరు నెలల తర్వాత ఆర్బీఐ తిరిగి సమీక్షిస్తుందని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. నాది బాధ్యత... పీఎంసీ బ్యాంకు ఎండీ జాయ్ థామస్ ఖాతాదారులు, డిపాజిట్‌దారులకు ఓ సందేశం పంపించారు. ‘‘బ్యాంకు ఎండీగా నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఈ అవకతవకలను ఆర్బీఐ ఆంక్షల గడువు ముగిసే ఆరు నెలల్లోపే చక్కదిద్దడం జరుగుతుందని డిపాజిట్ దారులకు భరోసా ఇస్తున్నాను. అక్రమాలను సరిదిద్దటం ద్వారా ఆంక్షలను తొలగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ ఇది కష్ట కాలమని నాకు తెలుసు. ఏ క్షమాపణ అయినా మీరు పడుతున్న ప్రస్తుత బాధను తొలగించలేకపోవచ్చు’’ అంటూ జాయ్ థామస్ తన సందేశంలో పేర్కొన్నారు. ఖాతాదారుల ఆందోళన ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పీఎంసీ ఖాతాదారుల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమయ్యాయి. పలు బ్యాంకు శాఖల వద్ద ఖాతాదారులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ముంబైలోని సియాన్, మరోల్ శాఖల వద్ద దర్శనమిచ్చాయి. ముంబైలోని బంధూప్‌లో బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్దకు వందలాది కస్టమర్లు చేరుకున్నారు. తమ డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు ఎక్కువ మంది బ్యాంకు శాఖలకు తరలివచ్చారు. కానీ, రూ.1,000 మించి తీసుకునేందుకు అనుమతించకపోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఖాతాదారులు, చిన్న వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, పెన్షనర్లు వీరిలో ఎక్కువగా ఉన్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న వాటిని మాత్రం తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది అనుమతించడం గమనార్హం. వివాహాల వంటి ప్రత్యేక అవసరాల కోసం డిపాజిట్ చేసిన వారి పరిస్థితి అయోమయంగా మారింది. ‘‘నా రూ.60 లక్షలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. రెండు రోజుల క్రితమే కొత్తగా రూ.2లక్షలను డిపాజిట్ చేశాను. నెల, రెండు నెలలు, ఆరు నెలల తర్వాత ఎప్పుడైనా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పారు. నా డబ్బులను వెనక్కి తీసుకోగలిగితే అది అద్భుతమే’’ అని గత 20 ఏళ్లుగా పీఎంసీ బ్యాంకు ఖాతాదారునిగా ఉన్న 44 ఏళ్ల మారుతి పాటిక్ అనే ఖాతాదారుడు తెలిపారు. ఓ ఆటో డ్రైవర్ తన రూ.10,000 డిపాజిట్ గురించి ఆందోళన చెందితే, మరో చిన్న వ్యాపారస్తుడు బ్యాంకు నుంచి ప్రతీ నెలా జరగాల్సిన రూ.60,000 ఈఎంఐ గురించి ఆందోళన చెందా డు. ఖాతాదారుల ఆందోళన హింసాత్మకం దాల్చకుండా పోలీసులు రక్షణ కలి్పంచారు. మరో యువ మహిళ తన ఖాతా నుంచి రూ.1,000 వెనక్కి తీసుకోగా, మళ్లీ ఆరు నెలల తర్వాతే ఉపసంహరణకు అవకాశం ఉంటుందని చెప్పడం గమనార్హం. పీఎంసీ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో బ్యాంకు డిపాజిట్ దారుల ప్రయోజనాల పరిరక్షణపై అఖిలభారత బ్యాంకు డిపాజిటర్ల అసోసియేషన్ ఆందో ళన వ్యక్తం చేసింది. అదే సమయంలో డిపాజిట్ల విలువ హరించుకుపోకుండా ఆర్బీఐ వెంటనే పరిరక్షణ చర్యలు చేపట్టడాన్ని స్వాగతించింది. -
‘ఖాతాదారులకు పట్టపగలే చుక్కలు’
న్యూఢిల్లీ: పాత నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధన ఖాతాదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. అయిదు వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధనపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసుకునేందుకు నిరాకరించడమేగాక..ఖాతాదారులను బ్యాంకర్లు ఇంటరాగేషన్ తరహాలో ప్రశ్నలతో వేధిస్తున్నారు. మొదటి డిసెంబర్ 30లోపు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్న కేంద్రం..ఇప్పుడు ఎందుకు మాట మార్చిందంటూ ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నగదు కోసం జనాలు బ్యాంకులతో పాటు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు. -
మార్చిలో ‘తపాలా బ్యాంక్’
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు కర్నూలు (ఓల్డ్‌సిటీ): మార్చిలో భారత తపాలా చెల్లింపు బ్యాంకు (ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్) కర్నూలులో స్థాపించనున్నట్లు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తపాలా శాఖ వందేళ్లుగా దేశంలోని మారుమూల ప్రదేశాల్లో ఉన్న పేదలకు సైతం ఆర్థిక సేవలు అందిస్తోందన్నారు. ఇతర బ్యాంకుల కంటే మూడురెట్లు అధికంగా సేవా పరిధి కలిగిన తపాలా శాఖ అధిక సంఖ్యలో ఖాతాదారులకు సేవలు అందిస్తోందన్నారు. కర్నూలు హెడ్ పోస్టాఫీసులో రీజనల్ కార్యాలయం 2017 మార్చి నాటికి , సెప్టెంబరు నాటికి దేశవ్యాప్తంగా 650 బ్యాంకులు ప్రారంభమవుతాయని వివరించారు.