మార్చిలో ‘తపాలా బ్యాంక్’
– పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మార్చిలో భారత తపాలా చెల్లింపు బ్యాంకు (ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్) కర్నూలులో స్థాపించనున్నట్లు కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తపాలా శాఖ వందేళ్లుగా దేశంలోని మారుమూల ప్రదేశాల్లో ఉన్న పేదలకు సైతం ఆర్థిక సేవలు అందిస్తోందన్నారు. ఇతర బ్యాంకుల కంటే మూడురెట్లు అధికంగా సేవా పరిధి కలిగిన తపాలా శాఖ అధిక సంఖ్యలో ఖాతాదారులకు సేవలు అందిస్తోందన్నారు. కర్నూలు హెడ్ పోస్టాఫీసులో రీజనల్ కార్యాలయం 2017 మార్చి నాటికి , సెప్టెంబరు నాటికి దేశవ్యాప్తంగా 650 బ్యాంకులు ప్రారంభమవుతాయని వివరించారు.