తపాలా బ్యాంకుకు అంతర్జాతీయ ఖ్యాతి
తపాలా బ్యాంకుకు అంతర్జాతీయ ఖ్యాతి
Published Mon, Oct 10 2016 11:31 PM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
బాపట్ల: భారత తపాలాబ్యాంకు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద బ్యాంకుగా విరాజిల్లుతున్నదని పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రావూరి ఫణిప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా జరిగిన పొదుపు దినోత్సంలో సోమవారం పాల్గొని మాట్లాడారు. దేశంలోని అన్ని బ్యాంకుల కన్నా తపాలా బ్యాంకు అన్ని రకాల డిపాజిట్లపై అధికంగా అరశాతం వడ్డీ చెల్లిస్తోందని వివరించారు. కష్ణాపుష్కరజలాలు, కనకదుర్గ కుంకుమార్చన సేవలందించడంలో బాపట్ల డివిజన్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించినట్లు తెలిపారు. పొదుపు దినోత్సవం సందర్భంగా బాపట్ల ప్రధాన తపాలా కార్యాలయ పరిధిలో 500 నూతన సేవింగ్స్ బ్యాంకు ఖాతాలను ప్రారంభిస్తునట్లు చెప్పారు. తపాలా ఫోరం సభ్యులు డాక్టరు పి.సి.సాయిబాబు , హెడ్‌పోస్టు మాస్టర్ పి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement