న్యూఢిల్లీ: పాత నోట్ల డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధన ఖాతాదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. అయిదు వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధనపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసుకునేందుకు నిరాకరించడమేగాక..ఖాతాదారులను బ్యాంకర్లు ఇంటరాగేషన్ తరహాలో ప్రశ్నలతో వేధిస్తున్నారు. మొదటి డిసెంబర్ 30లోపు పాత నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్న కేంద్రం..ఇప్పుడు ఎందుకు మాట మార్చిందంటూ ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నగదు కోసం జనాలు బ్యాంకులతో పాటు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతూనే ఉన్నారు.