రైతులకు పెట్టుబyì సాయం∙చెక్కులుఅందజేస్తున్న అధికారులు(ఫైల్)
సాక్షి, మెదక్‌జోన్: వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కారించేందుకు ప్రవేశపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం వేలాది మంది అన్నదాతలకు నిరాశే మిగుల్చుతోంది. జిల్లాలోని 44,932 ఎకరాల భూముల పలు సమస్యల్లో ఉన్నాయి. సమస్యాత్మక భూములను పార్ట్ బీలో ఉంచడంతో ఈ భూముల రైతులు ఖరీఫ్‌లో పంపిణీ చేసిన సాగు పెట్టుబడి సాయం(రైతుబంధు) అందలేదు. ప్రస్తుతం రబీ సీజన్‌కు మళ్లీ పెట్టుబడి సాయం అందించేందుకు అధికారులు రైతుల అకౌంట్ నంబర్లను సేకరిస్తున్నారు. కానీఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం కొత్త వారికి రైతుబంధు ఇవ్వరాదనే నిబంధనతో సమస్యలు తీరిన రైతులకు సైతం రబీలో రైతుబంధు అందే పరిస్థితి లేకుండా పోయింది.
ఇక సమస్యలు పరిష్కారం కాని రైతుల పరిస్థితి ఇంకా ఇబ్బందిగా మారింది. భూ సమస్య పరిష్కారం కాకపోగా రైతుబంధు రాని దుస్థితి. జిల్లాలో 3.20 లక్షల ఎకరాలు భూమి ఉండగా 25వేలకు పైగా ఎకరాల భూములు సమస్యల్లో ఉన్నాయి. ప్రధానంగా అటవీ భూములని ఫారెస్ట్ అధికారులు రైతులు సాగు చేసుకునే వేలాది ఎకరాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి భూములను జాయింట్ సర్వే పేరుతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తున్నారు. అలాగే అనేక గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న భూములతో పొలిస్తే రికార్డుల్లో మూడింతలు ఎక్కువగా ఉండడం వల్ల వాటి లెక్కలను తెల్చేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి భూములు చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి, ఎస్. కొండాపూర్, హవేళిఘణాపూర్ మండలంలోని బూర్గుపల్లి, లింగ్సాన్‌పల్లి తండా, గాజిరెడ్డిపల్లి, దూప్‌సింగ్, అల్లాదుర్గం తదితర మండలాల్లో సమస్యలు కొకల్లలుగా ఉన్నాయి.
వీటిని పరిష్కారించేందుకు అధికారులు అడపదడపా సర్వేలు చేపడుతున్నప్పటికీ ఇవి నేటికీ కొలిక్కి రావడం లేదు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభించి ఏడాది కావస్తున్న ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. దీంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఆ సొమ్మును ప్రస్తుత రబీ సీజన్‌లో నేరుగా రైతుల అకౌంట్‌లలో జమ చేసేందుకు రైతుల అకౌంట్ నంబర్లను సేకరిస్తున్నారు.
1.90 లక్షల చెక్కుల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా ఈ లెక్కన 6.6 శాతం భూముల సమస్యలు పరిష్కరించాల్సింది. ఖరీఫ్‌కు ముందు 1.90 లక్షల చెక్కుల రూపంలో రూ. 140 కోట్లను అందజేశారు. ఇందులో చనిపోయిన రైతులు, విదేశాల్లో ఉన్న రైతులతో పాటు తక్కువ భూమి ఉన్న తదితర రైతులు 26వేల చెక్కులు మిగిలిపోయాయి. వాటికి సంబంధించి సుమారు రూ. 18 కోట్లు మిగిలినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన చెక్కులను ప్రభుత్వానికి తిరిగి పంపించారు. ప్రస్తుత రబీ సీజన్‌లో సమస్యల్లో ఉన్న భూములను వదిలేసి ఖరీఫ్‌లో చెల్లించిన మాదిరిగానే రబీలోనూ రైతుబంధు పెట్టుబడి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తమ సమస్యలు ఇంకెన్నాళ్లకు పరిష్కారిస్తారంటూ చెక్కులందని బాధిత రైతులు ప్రభుత్వంపై గుర్రుమీద ఉన్నారు.
అయోమయ పరిస్థితి..
వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కరించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభిం చి ఏడాది పూర్తయిం ది. సర్వేలు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు. మా గ్రామంలో 500 ఎకరాల్లోని భూములు మూడు సర్వే నంబర్లతో ఉన్నాయి. నాకు అందులో రెండు ఎకరాల భూ మి ఉంది. రికార్డుల్లో భూమి ఎక్కువగా ఉందని నాకు ఖరీఫ్‌లో రైతుబంధు చెక్కు ఇవ్వలేదు. ఇప్పుడైనా చెక్కు ఇస్తారో?... ఇవ్వరో? తెలియని అయోమయ పరిస్థితి. –కుమ్మరి సిద్దిరాములు, జంగరాయి
పార్ట్–బీ భూములకు సాయం లేదు..
సమస్యల్లో ఉన్న భూములు 44,932 ఎకరాలున్నాయి. ఈ భూములను సర్వే చేయిస్తున్నాం. వీటిలో ముఖ్యంగా అటవీ భూములున్నట్లు ఆ శాఖాధికారులు చెప్పడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వేలు ప్రారంభించాం. అలాగే కొన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో భూములు తక్కువ ఉండి రికార్డుల్లో మాత్రం మూడింతలుగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి భూములను పార్ట్–బీలో పొందుపర్చాం. రబీలోనూ ఈ భూములకు పెట్టుబడి సాయం లేదు. వీటి సమస్యలు పూర్తిగా పరిష్కారించాక నూతన పాస్‌బుక్‌లు అందజేసిన అనంతరం పెట్టుబడి సాయం అందుతుంది. –నగేశ్, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment