ఖాతాల్లోకే ‘రైతుబంధు’ | Rythu Bandhu Cheques Distribution Medak | Sakshi
Sakshi News home page

ఖాతాల్లోకే ‘రైతుబంధు’

Published Mon, Oct 8 2018 12:31 PM | Last Updated on Tue, Oct 16 2018 3:19 PM

Rythu Bandhu Cheques Distribution Medak - Sakshi

నిజాంపేటలో చెక్కులు పంపిణీ చేస్తున్న అధికారులు (ఫైల్‌)

సాక్షి, మెదక్‌జోన్‌: రైతులకు సాగు పెట్టుబడి కోసం ప్రత్యేకంగా చేపట్టిన రైతుబంధు పథకంలో భాగంగా 5వ తేదీ  నుంచి జిల్లాలో  చెక్కుల పంపిణీని ప్రారంభించారు. తూప్రాన్, కౌడిపల్లి, నర్సాపూర్, నిజాంపేట, తదితర మండలాల్లో కొంతమందికి పంపిణీ చేశారు.  కాగా అదే రోజు ఎన్నికల కోడ్‌ రావడంతో చెక్కుల పంపిణీని నిలిపివేశారు.   కానీ నేరుగా గ్రామాల్లోకి వెళ్లి రైతులకు చెక్కుల పంపిణీ చేయటాన్ని నిలిపివేయాలన్న ఎన్నికల కమిషన్‌ నేరుగా రైతు అకౌంట్లో పెట్టుబడి సాయం వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు  అధికారులు చెబుతున్నారు. దీంతో ఎకరాకు రూ. 4 వేల చొప్పున నేరుగా  ఆయా రైతుల అకౌంట్లోకే డబ్బులను వేసేందుకు అధికారులు  సిద్ధమౌతున్నారు.  ఇందుకోసం రైతుల పేర్లు, ఎంత భూమి ఉంది?  అకౌంట్‌ నంబర్లను  తీసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఎలాంటి అర్భాటం లేకుండా నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు పడితే బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బులను డ్రా చేసుకునే వీలు ఉంటోందని అధికారులు ఆలోచన.

2.20 లక్షల మంది రైతులకు లబ్ధి 
రబీ సీజన్‌కోసం పెట్టుబడి సాయం కింద జిల్లాలో  2.20 లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరనుంది. జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 3.20 లక్షల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇందుకోసం రూ. 140 కోట్లను  నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా రైతులకు  పంపిణీ  చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.  రబీ ప్రణాళికను సైతం ఇప్పటికే వ్యవసాయశాఖ అ«ధికారులు సిద్ధం చేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తదితర వాటిని అందుబాటులో ఉంచామని వివరిస్తున్నారు. ఈ నెలలో పంపిణీ చేస్తే ముందుగా సన్నద్ధమై సాగుచేసుకునేందుకు వీలు ఉంటోంది.
 
అప్పు కింద పట్టుకుంటారా..?
 రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు డబ్బులు వేస్తే పంట రుణాలకు సంబంధించి పట్టుకుంటారని పలువురు రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. 95 శాతం మంది రైతులు బ్యాంకు అధికారులకు అప్పులే ఉన్నారు. ఈ పెట్టుబడి సహాయాన్ని బ్యాంకు అధికారులు పట్టుకుంటే తమ పరిస్థితి ఏంటని పలువురు రైతులు వాపోతున్నారు. అదే జరిగితే ప్రభుత్వం తమకు ఇచ్చిన పెట్టుబడి అక్కరకు  రాకుండా పోతుందని వారు బావిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు బ్యాంకు అధికారులకు సరైన సూచనలు ఇస్తేనే బాగుంటుందని  అన్నదాతలు కోరుతున్నారు.

ఖరీఫ్‌లో మిగిలిన చెక్కులు
ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌లో పంపిణీ చేయగా జిల్లా వ్యాప్తంగా 26 వేల చెక్కులు మిగిలిపోయాయి. ఈ చెక్కులు పట్టాదారులకు తప్ప కుటుంబీకులకు కూడా ఇవ్వలేదు. దీంతో జిల్లాలో ఖరీఫ్‌ సిజన్‌లో జిల్లావ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలకుగాను 2.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు.  ఇందులో ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన చెక్కులు, చనిపోయినవారి చెక్కులు, కొద్ది పాటి అమౌంట్‌ ఉన్న చెక్కులు    మిగిలిపోయాయి. వీటిని తిరిగి ప్రభుత్వానికి పంపించారు. అలా కాకుండా అందుబాటులో లేని రైతుల చెక్కులను సంబంధిత కుటుంబీకులకు అందజేస్తే ఉపయోగకరంగా ఉంటోందని రైతులు సూచిస్తున్నారు. 

ఖాతా నంబర్లు ఇవ్వాలి..
పెట్టుబడి సాయానికి సంబంధించి చెక్కుల పంపిణీకి ఎన్నికల కోడ్‌ అడ్డు రావటంతో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు ఏర్పాట్లు  జరుగుతున్నాయి. దీనితో అందుబాటులో లేని రైతులకు సైతం  పెట్టుబడి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కానీ సంబంధిత రైతు బ్యాంకు ఖాతాను తప్పని సరిగా అందించాల్సి ఉంది.
పరుశురాం, జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement