సాక్షి,న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం త్వరలో చెక్‌బుక్‌లను ఉపసంహరించుకుంటుందన్న ప్రచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు చెక్ బుక్‌లను ఉపసంహరిస్తారన్న వార్తలు మీడియాలో వచ్చాయని, దీన్ని ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చిందని, అలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చెక్‌బుక్ సదుపాయాన్ని ఉపసంహరిస్తుందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్‌వాల్ ఇటీవల పేర్కొన్న క్రమంలో ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.నగదు లావాదేవీలను వీలైనంత తగ్గించేందుకు ప్రభుత్వం భారీ లక్ష్యాలనే తలకెత్తుకుంది.
నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగినా క్రమంగా నగదు లభ్యత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment