రోమ్: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్‌లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు.
వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment