Albania
-
స్పెయిన్ ‘హ్యాట్రిక్’
డసెల్డార్ఫ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్ జట్టుకు ఫెరాన్ టోరెస్ ఏకైక గోల్ అందించాడు. మూడు విజయాలతో స్పెయిన్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్ ‘బి’లో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్‌ను డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. క్రొయేíÙయా తరఫున లూకా మోడ్రిచ్ (55వ ని.లో), ఇటలీ తరఫున జకాగ్ని (90+8వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్ (38 ఏళ్ల 289 రోజులు) గుర్తింపు పొందాడు. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్‌ను ఓడించగా... ఫ్రాన్స్, పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాయి. -
‘యూరో’లో ఇటలీ శుభారంభం
డార్ట్మండ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఇటలీ జట్టు శుభారంభం చేసింది. అల్బేనియాతో జరిగిన గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో ఇటలీ 2–1తో గెలిచింది. ఆట మొదలైన 23 సెకన్లకే అల్బేనియా ప్లేయర్ బజ్రామి గోల్ చేయడంతో చేశాడు. 64 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా నమోదైన గోల్ ఇదే కావడం విశేషం. తొలి నిమిషంలో గోల్ సమరి్పంచుకున్న ఇటలీ వెంటనే తేరుకుంది. 11వ నిమిషంలో బస్తోని... 16వ నిమిషంలో బరెల్లా ఒక్కో గోల్ చేయడంతో ఇటలీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. హాంబర్గ్‌లో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 2–1తో పోలాండ్‌ను ఓడించగా... స్టుట్‌గార్ట్‌లో డెన్మార్క్, స్లొవేనియా జట్ల మధ్య గ్రూప్ ‘సి’ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. -
పర్యాటకుల రెస్టారెంట్ బిల్లు కట్టిన ఇటలీ ప్రభుత్వం
రోమ్: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు. వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం. -
ముమ్మాటికీ అక్రమమే.. రష్యాకు భారీ షాక్
న్యూయార్క్: ఐక్య వేదిక నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ముక్తకంఠంతో ఖండించాయి ప్రపంచ దేశాలు. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రష్యా వ్యతిరేక తీర్మానానికి ఏకపక్షంగా ఓటేశాయి ప్రపంచ దేశాలు. ఉక్రెయిన్ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగాక సాధారణ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ ముసాయిదా తీర్మానంపై.. UNGA(ఐరాస సాధారణ అసెంబ్లీ) అత్యవసర ప్రత్యేక సమావేశంలో రికార్డెడ్ ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. రష్యా వ్యతిరేక తీర్మానానికి 143 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యాతో పాటు ఉత్తర కొరియా, బెలారస్, సిరియా, కరేబియన్ దేశం నికరాగ్వాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించగా.. భద్రతా మండలిలో అమెరికా-ఆల్బేనియా తీసుకొచ్చిన తీర్మానాన్ని వీటో పవర్‌తో వీగిపోయేలా చేసింది రష్యా. అయితే ఇప్పుడు సర్వసభ్య దేశ వేదికైన ఐరాస అసెంబ్లీలో మాత్రం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో యుద్ధం ఆపేయాలంటూ ప్రపంచ దేశాలకు రష్యాకు బలంగా పిలుపు ఇచ్చినట్లయ్యింది. మారని భారత్ తీరు ఇక ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరి మారడం లేదు. తటస్థ తీరునే అవలంభిస్తూ వస్తోంది. తాజాగా సాధారణ అసెంబ్లీలో రష్యా వ్యతిరేక తీర్మానంపై కూడా అదే వైఖరి అవలంభించింది. ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. అయితే.. అంతకు ముందు ఈ తీర్మానం ఓటింగ్ ఎలా జరగాలనే అంశంపై మాత్రం రష్యాకు భారత్ షాక్ ఇచ్చింది. రికార్డెడ్ ఓటింగ్ జరగాలని ఆల్బేనియా-రహస్య బాలెట్ కోసం రష్యా పట్టుబట్టగా.. జరిగిన ఓటింగ్‌లో భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటేసి.. ఆశ్చర్యపరిచింది. ఇదీ చదవండి: యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. అండగా ఉంటాం! -
ఆల్బేనియాలో తీవ్ర భూకంపం
తిరానా: ఐరోపా దేశం ఆల్బేనియాలో భారీ భూకంపం సంభవించి 20 మంది చనిపోయారు. మంగళవారం ఉదయం 4 గంటలకు (స్థానిక కాలమానం) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆల్బేనియా రాజధాని తిరానాకు 30 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. రాత్రి వేళ వేళ భూకంపం రావడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. 600 మందికి పైగా గాయపడగా, భూకంపం ధాటికి మూడు భవనాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు. -
డేంజరస్ మ్యాన్ ఎట్టకేలకు దొరికాడు!
టిరానా : తన బంధువుల కుటుంబంలోని 8 మందిని దారుణహత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతడు సైకోలా మారి ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హత్యల ఉదంతం అల్బేనియాలో ఇటీవల చోటుచేసుకుంది. రిడ్వాన్ జైకాజ్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన బంధువుల కుటుంబంపై పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో రాజధాని టిరానాకు 90 కిలోమీటర్ల దూరంలోని రెస్యూలాజ్ అనే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి ఏకే-47తో వెళ్లాడు. ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి తన తాతను ఆపై ఆమె భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఆ ఫ్యామిలోని మరో ఆరుగురు సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ నిందితుడి చేతిలో హత్యకు గురైన వారిలో 9 ఏళ్ల చిన్నారి, ఓ టీనేజీ బాలిక సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిడ్వాన్ జైకాజ్ ఫొటోను చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతడు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 24 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు ఆ కరడుగట్టిన నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. -
అల్బేనియా కొండంత అందం!
అదిగో అల్లదిగో... ఎన్నో జాతులు పరిపాలించినా తన భాష, సంస్కృతులను మాత్రం పదిలంగా కాపాడుకుంది అల్బేనియా. భౌగోళిక అందాలు ఈ చిన్ని దేశానికి కొండంత గుర్తింపును ఇస్తున్నాయి. అల్బేనియా సామెతల్లో...‘ఎవరింటికి వారే రాజు’ అనే సామెత ఒకటి ఉంది. చిత్రమేమిటంటే, తరతరాలుగా ఎన్నో జాతుల దండయాత్రకు గురైన అల్బేనియా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒట్టోమన్ సుల్తాన్లు అల్బేనియాను నాలుగు శతాబ్దాలు పరిపాలించారు. పన్నుల పెంపు, నిర్బంధ సైనిక శిక్షణ మొదలైన కారణాలతో తలెత్తిన ‘అల్బేనియన్ తిరుగుబాటు’ ఉద్యమం ఆ దేశ చరిత్రలో కొత్త అధ్యాయానికి దారి తీయడమే కాదు... ఒట్టోమన్ సామ్రాజ్యం బలహీనమైన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. 1912లో ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి విముక్తి పొందింది అల్బేనియా. 1944-1946ల మధ్య ‘డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్ అల్బేనియా’గా, 1946-1976ల మధ్య ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ అల్బేనియా’గా అల్బేనియా ఉనికిలో ఉంది. కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్వెర్ హోజా 1967లో అల్బేనియాను ‘ప్రపంచంలో తొలి నాస్తికదేశం’గా ప్రకటించాడు. ‘డెమొక్రటిక్ పార్టీ’ స్థాపన ఆ దేశ రాజకీయ చరిత్రలో మరో ముఖ్య ఘట్టం. దేశంలో డెబ్భైశాతం కొండలే. అల్బేనియాలో ఎత్తై పర్వతం కొరబ్. 9,068 అడుగుల ఎత్తు ఉన్న ఈ పర్వతం అల్బేనియా, రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలకు సరిహద్దుగా ఉంది. ఆగ్నేయంలో ఉన్న ఒహ్రిడ్ సరస్సు యూరప్‌లోని ప్రాచీనమైన, లోతైన సరస్సులలో ఒకటి. 1979లో యునెస్కో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్’ జాబితాలో చోటు చేసుకుంది. చిన్న దేశమైన అల్బేనియా జీవవైవిధ్యంలో మాత్రం విశాలమైనది. 3000 రకాల భిన్నమైన జాతుల మొక్కలు ఈ దేశంలో పెరుగుతాయి. 353 పక్షి జాతులు అల్బేనియాలో ఉన్నాయి. ఒకప్పుడు సోషలిస్ట్ దేశంగా పేరుగాంచిన అల్బేనియా ఆ తరువాత పెట్టుబడిదారి దారిలో నడిచింది. దేశంలో విదేశీ పెట్టబడులు పెరిగాయి. ఒకప్పుడు కరెంట్ కష్టాలు ఎదుర్కొన్న అల్బేనియా ఇప్పుడు విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. వ్యవసాయ ప్రధానమైన ఈ దేశంలో సహజ వాయువు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. పర్యాటకపరంగా కూడా అల్బేనియాకు ప్రాధాన్యత ఉంది. జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగం పర్యాటకరంగం నుంచే వస్తుంది. ఒట్టోమన్ పాలనలో సుదీర్ఘకాలంగా ఉండడం వల్ల కావచ్చు... మిగిలిన యురోపియన్ దేశాలతో పోల్చితే అల్బేనియా కళారూపాలలో భిన్నత్వం కనిపిస్తుంది. ప్రస్తుతం అల్బేనియా అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపులో ఉంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ * తల అడ్డంగా ఊపడం అనేది ‘ఇష్టం లేదు’ అనే భావానికి సూచనగా భావిస్తాం. కానీ అల్బేనియాలో మాత్రం రివర్స్. తల అడ్డంగా ఊపడం అనేది ‘నాకు ఆమోదమే’ అని చెప్పడం! నిలువునా ఊపితే ‘నాకు ఇష్టం లేదు’ అని చెప్పడం. * అల్బేనియా ప్రధాన క్రీడ ఫుట్‌బాల్. * అల్బేనియాను స్థానికంగా ‘షిక్విపేరియా’ అని పిలుచుకుంటారు. దీని అర్థం ‘డేగల భూమి’. * దేశవ్యాప్తంగా ఏడు లక్షల వరకు బంకర్లు ఉన్నాయి. * ప్రపంచం అమ్మగా కొలిచే మదర్ థెరిసా జన్మతః అల్బేనియన్. ఒట్టోమన్ సామ్రాజ్యంలోని స్కోప్జిలో (ఇప్పుడు మాసిడోనియాలో ఉంది) జన్మించారు. -
350 కేజీల గంజాయి స్వాధీనం
అల్బేనియాలోని దక్షిణ కోస్తా తీరప్రాంత నగరమైన వ్లోరా పట్టణంలో ఓ పడవ నుంచి 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఆ నగరంలోని ఓడరేవులో ని్న్న పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఆ గంజాయిని పట్టుకున్నట్లు వివరించారు. 11 బ్యాగుల్లో నింపి ఉంచిన ఆ మత్తు పదార్థాన్ని కనుగొన్నట్లు తెలిపారు. కాగా ఆ బ్యాగ్‌లు ఇతర ప్రాంతల నుంచి ఇక్కడి తీసుకు వచ్చారా లేకా ఎక్కడికైన తరలించేందుకు సిద్ధంగా ఉంచారా అనేది తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మత్తుమందు అక్రమ రవాణకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు అల్బేనియా పోలీసులు మంగళవారం తెలిపారు.