350 కేజీల గంజాయి స్వాధీనం | 350 kg of marijuana seized in Albania | Sakshi
Sakshi News home page

350 కేజీల గంజాయి స్వాధీనం

Published Tue, Sep 24 2013 8:36 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM

350 kg of marijuana seized in Albania

అల్బేనియాలోని దక్షిణ కోస్తా తీరప్రాంత నగరమైన వ్లోరా పట్టణంలో ఓ పడవ నుంచి 350 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఆ నగరంలోని ఓడరేవులో ని్న్న పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఆ గంజాయిని పట్టుకున్నట్లు వివరించారు. 11 బ్యాగుల్లో నింపి ఉంచిన ఆ మత్తు పదార్థాన్ని కనుగొన్నట్లు తెలిపారు.

 

కాగా ఆ బ్యాగ్లు ఇతర ప్రాంతల నుంచి ఇక్కడి తీసుకు వచ్చారా లేకా ఎక్కడికైన తరలించేందుకు సిద్ధంగా ఉంచారా అనేది తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మత్తుమందు అక్రమ రవాణకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు అల్బేనియా పోలీసులు మంగళవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement