bill paid
-
పర్యాటకుల రెస్టారెంట్ బిల్లు కట్టిన ఇటలీ ప్రభుత్వం
రోమ్: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు. వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై రెస్టారెంట్ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్ ఐటమ్స్ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం. -
ఐసోలేషన్‌లో రోహిత్ శర్మ
మెల్బోర్న్: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది. ► సీఏ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లు ఇన్డోర్ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్డోర్ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది. ► బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్’ నాటి పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు. రెస్టారెంట్లో భారత క్రికెటర్లు -
ఆటలో అరటి పండు
-
బిల్లులు చెల్లించాల్సిందే!
కర్నూలు(అర్బన్) : సాగునీటి శాఖలో కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు ఇంజనీర్లు విలవిలలాడుతున్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు పనులు నాణ్యతగా చేయకపోయినప్పటికీ బిల్లులు చెల్లించాల్సిందేనంటూ కాంట్రాక్టర్లు ఒత్తిళ్లు చేస్తున్నారు. మరమ్మతులు, ఆధునికీకరణ, పునరుద్ధరణ (ట్రిపుల్ ఆర్) పథకం కింద 8 చెరువుల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ బిల్లుల జారీ ఫైలు కలెక్టరేట్లో చక్కర్లు కొడుతున్నా బిల్లులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే సాగునీటిశాఖ ఎస్ఈ నాగేశ్వరరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకే సెలవులో వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, సొంత పనులకే సెలవులో వెళుతున్నానని ఎస్ఈ అంటున్నారు. తాత్కాలికంగా ఇంచార్జీ ఎస్ఈగా ఎస్ఆర్బీసీ ఎస్ఈ శ్రీనివాసరావు నియమితులయ్యారు. మొత్తం మీద తాజా పరిణామాలు సాగునీటి శాఖలో కలకలం రేపుతున్నాయి. రూ. 70 లక్షల బిల్లుల కోసం ఒత్తిళ్లు! జిల్లాలోని 8 చెరువుల్లో ట్రిపుల్ ఆర్ పథకం కింద కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి రూ.70 లక్షలను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వుంది. అయితే ఈ పనులకు సంబంధించి బిల్లులను మంజూరు చేయాల్సిన జిల్లా కలెక్టర్ పలు పనులను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేయడమే గాక, బిల్లుల ఫైల్‌ను తిప్పి పంపించేసినట్లు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులను చెల్లించాలని ఎస్ఈపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచినట్లు సమాచారం. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనుల విషయంలో కూడా ఎస్ఈపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తగినంత మంది సిబ్బంది లేని కారణంగానే పనుల్లో పురోగతి కనిపించడం లేదనే విషయాన్ని ఎస్ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోలేక పోవడం వల్లే మాట పడాల్సి వచ్చిందని నీటి పారుదల శాఖ ఉద్యోగులే చెప్పుకోవడం గమనార్హం. ఈ పోస్టు కోసం పైరవీలు షూరూ...! మరోవైపు జిల్లా నీటి పారుదలశాఖకు ఎస్ఈగా వచ్చేందుకు పక్క జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మరో ఎస్ఈ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా వ్యక్తిగత పనుల నిమిత్తం ఎస్ఈ ఆర్ నాగేశ్వరరావు ఈ నెల 3వ తేదీ నుంచి మార్చి 21 వరకు సెలవు పెట్టారు. ఎస్ఈ నాగేశ్వరరావు సెలవుపై వెళ్లిన దృష్ట్యా నంద్యాల ఎస్ఆర్బీసీ సర్కిల్-1 ఎస్ఈ శ్రీనివాసరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు నీటి పారుదలశాఖ (పరిపాలన) ఈఎన్సీ రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇంచార్జి ఎస్ఈ శ్రీనివాసరావు ఈ నెల 4వ తేదీన రానున్నారు.