కేవలం వెజ్ మీల్స్‌తో రూ.10 కోట్లు ఆదా
కేవలం వెజ్ మీల్స్‌తో రూ.10 కోట్లు ఆదా
Published Wed, Aug 9 2017 9:29 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM
న్యూఢిల్లీ : తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా ఎప్పడికప్పుడూ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నాన్-వెజ్ మీల్స్ ఎక్కువగా వేస్ట్ అవుతుందని, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఇటీవలే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎయిరిండియాకు వార్షికంగా 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం పార్లమెంట్‌కు చెప్పింది. వారికి కేవలం శాకాహార భోజనం సరఫరా చేయడంతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంది.
నాన్-వెజిటేరియన్ మీల్స్ కేవలం ఎయిరిండియా దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ వారికే రద్దు చేశామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మెనూలో, భోజన షెడ్యూల్‌లో పలు మార్పులు చేశామని, ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా అనుబంధ వస్తువులను అందించడం వంటి చర్యలతో ఈ విమానయాన సంస్థకు ఖర్చులు తగ్గి వార్షికంగా ఎయిరిండియాకు రూ.20 కోట్ల మేర ఆదా అవుతాయని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement