economy class
-
ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్
ముంబై: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరిచయం చేస్తోంది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లతోపాటు స్వల్ప దూర అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రకటించింది.ప్రస్తుతం దేశీయంగా విస్తారా మాత్రమే ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా ఏ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లో బిజినెస్ క్లాస్‌లో 8 సీట్లు, ప్రీమియం ఎకానమీ 24, ఎకానమీ విభాగంలో 132 సీట్లను కేటాయించింది.తొలుత ఢిల్లీ–బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చండీఘఢ్–ఢిల్లీ రూట్లలో ప్రీమియం ఎకానమీ క్లాస్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఏడాదిలో ఎయిర్ ఇండియా తన పూర్తి స్థాయి నారో-బాడీ ఫ్లీట్ కు త్రీ-క్లాస్ కాన్ఫిగరేషన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.. -
ఎకానమీ క్లాస్‌లో బాలీవుడ్ జంట.. మరీ ఇంత చీప్‌గానా..!
ఎల్లప్పుడు సినిమాలతో బిజీగా ఉండే తారలు.. వెకేషన్‌కు టైం కేటాయిస్తూనే ఉంటారు. సెట్స్, షూటింగ్‌లంటూ బిజీబిజీగా గడుపుతూ అలిసిపోతుంటారు. అందుకే తీరిక దొరికినప్పుడల్లా విహారయాత్రకు వెళ్తూ గ్యాప్ దొరికినప్పుడల్లా రిఫ్రెష్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు అప్పటికప్పుడు బ్యాగు సర్దేసుకుని విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా రొటీన్‌గా జరిగేదదైనా ఈ ట్రిప్‌లో కాస్త వెరైటీ కూడా ఉందండోయ్. అదేంటంటే ఈ బాలీవుడ్ ప్రేమ జంట ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం. అది చూసిన జనాలు అదేంటి? వీళ్లు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంత పెద్ద సెలబ్రిటీలు అయి ఉండి ఎకానమీ క్లాస్‌లో వెళ్లడం గ్రేట్ అని కొందరంటుంటే.. మరీ చీప్‌గా కాకుండా బిజినెస్ క్లాస్ లేదంటే ఫస్ట్ క్లాస్‌లో అయినా వెళ్లాల్సిందని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోలో కత్రినా తన గుర్తు పట్టకుండా ఉండేందుకు బ్లాక్ క్యాప్‌తో పాటు.. మాస్క్‌ను ధరించి ఉంది. అంతే కాకుండా ఈ క్లిప్‌లో స్టార్ జంట పక్కపక్కనే కూర్చుని వారి వారి మొబైల్స్‌లో నిమగ్నమైపోయారు. ఇక వీడియో మొదట్లో కత్రినా మాస్క్ తొలగించి ఫోన్లో బిజీగా ఉండగా.. ఓ అభిమాని సీక్రెట్‌గా రికార్డ్ చేశారు. అది గమనించిన కత్రినా వెంటనే మాస్క్ ధరించింది. ఈ వీడియోను చూస్తే వీరిద్దరూ ఏదో సీక్రెట్ వెకేషన్ వెళ్తున్నట్లు అర్థమవుతోంది. తమని ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండాలనే ఇలా ఎకానమీ క్లాస్‌లో వెళ్ళేందుకు ప్లాన్ చేసుకున్నారని కొందరు ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం వాళ్ల అనుమతి లేకుండా ఇలా వీడియోలు తీసి.. వారి ప్రైవసికి భంగం కలిగిస్తున్నారని మండిపడుతున్నారు. ఏదేమైనా ఈ జంట హాలిడే ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణం!
సాక్షి, న్యూఢిల్లీ: తక్కువ ఛార్జీలతో ఏసీ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే త్వరలో ప్రవేశపెట్టనున్న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌లను కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం చేసింది. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే శాఖ తెలిపింది. రాజధాని, శతాబ్ది, దురంతో, జన శతాబ్ది, తదితర ప్రత్యేక తరహా రైళ్లు మినహాయించి.. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడిచే ఇతర మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ను అందుబాటులోకి తెస్తారు. ప్రతి బెర్త్‌కు ఏసీ డక్ట్ అమర్చారు. చదివేటపుడు తగిన వెలుతురొచ్చేలా ప్రతి బెర్త్ వద్ద లైట్లు ఏర్పాటుచేశారు. బెర్త్ వద్ద మొబైల్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెచ్చారు. మధ్య, ఎగువ బెర్త్‌లకు చేరుకునేందుకు అనుకూల డిజైన్‌తో నిచ్చెనలు రూపొందించారు. -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన ఆమిర్
ఓ టాప్ హీరో సాధరణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తే.. అబ్బో ఊహించడానికే కాస్తా అతిగా అనిపిస్తుంది కదా. కానీ దీన్ని నిజం చేసి చూపారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫేక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సాధరణ ప్రయాణికుడి మాదిరిగా ఎకానమీ క్లాస్‌లో పర్యటించారు ఆమిర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇండిగోకు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఉన్నట్టుండి ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో కూర్చుని.. తోటి ప్రయాణికులతో నవ్వుతూ మాట్లాడారు. దీన్ని కాస్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమిర్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘ఆమిర్ భాయ్.. నువ్వు రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసిన ఆమిర్.. త్వరలోనే ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రంలో నటించబోతున్నారు. -
విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై : దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ బుక్‌నౌ. ఫ్లైనౌ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టికెట్స్‌పై వర్తించే ఈ ఆఫర్ 2018, జూన్ 30 నాటికి ముగియనున్నట్టు అధికారులు చెప్పారు. వన్‌వే, రిటర్న్ జర్నీలు రెండింటికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అమస్టర్‌డ్యామ్, కొలంబో, పారిస్ తప్ప మిగతా అన్ని జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ రూట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని విమానయాన సంస్థ ప్రకటించింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్స్ బేస్ ధరలపై కూడా 25 శాతం డిస్కౌంట్ని అందించనున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జులై 11,2018 నాటి నుంచి ప్రయాణ కాలానికి సంబంధించి కనీసం 15 రోజుల ముందస్తుగా ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. మిగతా ఛార్జీలు, పరిమితులన్నింటిన్నీ టిక్కెట్ నియమ నిబంధనల్లో పేర్కొన్నట్టు కంపెనీ తెలిపింది. -
ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు శుభవార్త...
పారిస్ : యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ దిగ్గజం ఎయిర్‌బస్ తన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 2020 నాటికి ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు కూడా పడుకోని ప్రయాణించడానికి వీలుగా క్యాబిన్లలో బెర్తులను ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది. 2016 నవంబర్‌లో ఎయిర్ ఫ్రాన్స్- కేఎల్ఎం ఎకానమీ క్లాసు ప్రయాణికులకు కూడా స్లీపింగ్ బెర్త్స్ కల్పించాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. తక్కువ వ్యయంతో రూపొందించే ఈ బెర్తులను కాబిన్ పై భాగంలో గాని, కింది భాగంలో గాని ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్‌బస్, ఫ్రెంచ్ అంతరిక్ష సంస్థ సఫ్రాన్‌కు అనుబంధ సంస్థ అయిన జోడాయిక్ ఎయిరోస్పేస్ కంపెనీతో కలిసి A330 కార్గో జెట్లలో లోయర్ డెక్ స్లీపింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసే స్లీపర్ కంపార్ట్మెంట్స్ ప్రస్తుతం ఉన్న కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్ కంపార్టుమెంట్లలో సరిగ్గా సరిపోతాయని వెల్లడించింది. 2020 నాటికి A330 విమానాలకు సరిపోయే డిజైన్‌ను రూపొందించనున్నట్లు ఎయిర్‌బస్ తెలిపింది. ఈ ప్రయోగం ఫలిస్తే త్వరలోనే A330XWB ఎయిర్‌లైన్స్‌లో కూడా ఈ ప్రయోగాన్ని అమలు పరిచే అవకాశాలను అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎయిర్ బస్ కాబిన్ కార్గో ప్రోగ్రామ్‌ల ముఖ్య అధిపతి జెఫ్ పిన్నర్ మాట్లాడుతూ... ఈ మార్పు ప్రయాణికుల సౌకర్యం కోసం ఒక అడుగు ముందుకు వేయడానికి నిదర్శనమని భావించవచ్చు. మా ఈ ప్రయత్నాన్ని మిగతా ఎయిర్‌లైన్స్ వారు కూడా మెచ్చుకున్నారు. ఈ ప్రయోగానికి మంచి స్పందనే వస్తుందని అన్నారు. లోయర్ డెక్ పరిష్కారాలను చూపడంలో తమ సంస్ధకు మంచి నైపుణ్యం ఉందని జోడాయిక్ ఎయిరోస్పేస్ కాబిన్ డివిజన్ ముఖ్య అధికారి క్రిస్టోఫ్ బెర్నర్డిని కూడా చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే నేడు వేర్వేరు ఎయర్ లైన్స్ మధ్య భిన్నత్వాన్ని గుర్తించడానికి కీలక అంశంగా మారిందన్నారు. -
భారత్‌లోకి జజీరా ఎయిర్వేస్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న కువైట్ సంస్థ జజీరా ఎయిర్వేస్ భారత్‌లో అడుగు పెడుతోంది. లో కాస్ట్ ఎయిర్‌లైనర్‌గా పేరొందిన ఈ సంస్థ తొలుత హైదరాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభిస్తోంది. నవంబరు 17 నుంచి విమానయాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొచ్చి, ముంబై, అహ్మదాబాద్ నగరాల్లోనూ దశలవారీగా విస్తరించనుంది. హైదరాబాద్ నుంచి కువైట్‌కు నేరుగా ఫ్లయిట్స్ నడుపనుంది. ఎకానమీ క్లాస్‌లో 30 కేజీలు, బిజినెస్ క్లాస్‌లో 50 కేజీలు బ్యాగేజ్ ఉచితంగా అనుమతిస్తారు. హైదరాబాద్ నుంచి ఎకానమీ క్లాస్‌లో ఒకవైపునకు టికెట్ ధర కువైట్‌కు రూ.12,500, దుబాయి రూ.11,651, రియాద్ రూ.11,720 ఉంది. -
కేవలం వెజ్ మీల్స్‌తో రూ.10 కోట్లు ఆదా
న్యూఢిల్లీ : తీవ్ర నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియా ఎప్పడికప్పుడూ తమ ఖర్చులను తగ్గించుకోవడానికి కఠినతరమైన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నాన్-వెజ్ మీల్స్ ఎక్కువగా వేస్ట్ అవుతుందని, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా ఇటీవలే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు మాంసాహారాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఎయిరిండియాకు వార్షికంగా 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం పార్లమెంట్‌కు చెప్పింది. వారికి కేవలం శాకాహార భోజనం సరఫరా చేయడంతో ఇది సాధ్యమవుతుందని పేర్కొంది. నాన్-వెజిటేరియన్ మీల్స్ కేవలం ఎయిరిండియా దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్ వారికే రద్దు చేశామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా చెప్పారు. మెనూలో, భోజన షెడ్యూల్లో పలు మార్పులు చేశామని, ప్రస్తుత ట్రెండ్స్‌కు అనుగుణంగా అనుబంధ వస్తువులను అందించడం వంటి చర్యలతో ఈ విమానయాన సంస్థకు ఖర్చులు తగ్గి వార్షికంగా ఎయిరిండియాకు రూ.20 కోట్ల మేర ఆదా అవుతాయని ఆయన తెలిపారు. -
ఎకానమీ విమాన టికెట్ గరిష్టంగా రూ. 20 వేలే!
న్యూఢిల్లీ: ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎయిర్‌లైన్స్ ఇష్టారీతిగా విమాన ప్రయాణ చార్జీలను పెంచేయకుండా నియంత్రించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఎకానమీ తరగతి టికెట్లపై గరిష్టంగా రూ. 20,000 పరిమితి విధించాలని యోచిస్తోంది. ఎకానమీ తరగతి చార్జీలకు కనిష్ట, గరిష్ట స్థాయులు నిర్ణయించాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన శాఖ అంతర్గతంగా పంపిన నోట్లో పేర్కొంది. ఎకానమీ తరగతిలో గరిష్ట చార్జీని సుమారు రూ. 20,000 స్థాయిలో నిర్ణయించవచ్చని, అంతకు మించి వసూలు చేసేందుకు ఎయిర్‌లైన్స్‌ను అనుమతించరాదని అభిప్రాయపడింది. అలాగే, ఇతర సంస్థలతో పోటీ పడే క్రమంలో తమ సొంత ఆర్థిక పరిస్థితి సైతం దెబ్బతినే విధంగా కొన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయని, కనీసం నిర్వహణ వ్యయాలను కూడా ఆర్జించుకోలేకపోతున్నాయని పౌర విమానయాన శాఖ నోట్లో పేర్కొంది. ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే సమీప భవిష్యత్‌లో కొన్ని దేశీయ ఎయిర్‌లైన్స్ మూతబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. సర్వీసును బట్టి కిలోమీటరుకి లాభనష్ట రహిత చార్జీకి సముచిత స్థాయిలో లాభం చేర్చి వసూలు చేసుకునేలా ఎయిర్‌లైన్స్‌ని నిర్దేశించవచ్చని పేర్కొంది. -
ఎకానమీ క్లాస్ లో ప్రయాణించిన రక్షణమంత్రి
న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. అధికార ఆడంబరాలను పక్కకుపెట్టి విమానంలో ఆయన ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. నాలుగు రోజుల పర్యటన కోసం విమానంలో గోవా వెళ్లిన ఆయన సాధారణ ప్రయాణికులు ప్రయాణించే ఎకానమీ క్లాస్ లో ఎక్కారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోవా షిప్ యార్డును ఆయన సందర్శిస్తారు. నావికాదళ అధికారులతో భేటీ అవుతారు. 58 ఏళ్ల పారికర్ గతవారం వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకు ఆయన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ లైన్స్ కు షాక్.. ప్రయాణీకుడికి 20 లక్షల పరిహారం!
చెన్నై: ఓ ప్రయాణికుడికి 20 లక్షల పరిహారం చెల్లించాలని జర్మనీ దేశపు లుఫ్తాన్సా ఎయిర్స్ లైన్స్ ను తమిళనాడు రాష్ట్ర కన్స్యూమర్ రీడ్రసల్ కమిషన్ ఆదేశించింది. నాలుగేళ క్రితం ఫ్రాంక్ ఫర్ట్ నుంచి మాడ్రిడ్ కు ప్రయాణించిన సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ లో బిజినెస్ క్లాస్ బుకింగ్ చేసుకున్నానని, అయితే తనకు చెప్పకుండా ఎకానమీ క్లాస్ కు మార్చారని 70 సంవత్సరాల ప్రయాణీకుడు శివ ప్రకాశ్ గోయెంకా ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేస్తూ కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించారు. ఆతర్వాత పరిహారంగా తనకు 1500 యూరోల వోచర్ ఇచ్చారని, కాని తనకు 2.5 లక్షల టికెట్ రుసుం రీఫండ్ చేయాలని, తనకు కలిగిన అసౌకర్యారనికి 65 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే తాము రెండు ఎకానమీ క్లాస్ టికెట్లను ఇచ్చామని.. వోచర్ ను స్వీకరించారని జర్మన్ ఎయిర్ లైన్స్ తన వాదనను వినిపించింది. ఆ సమయంలో తాను అధికారులతో గొడవకు దిగితే ఫ్లైట్ మిస్ అవుతుందనే కారణంతో వెళ్లిపోయానని కన్స్యూమర్ కోర్టుకు బాధితుడు తెలిపారు. దాంతో గోయెంకాకు 20 లక్షల పరిహారం చెల్లించాలని ఎయిర్ లైన్స్ ను కోర్టు ఆదేశించింది. -
అన్నింటా ఏపీ సర్కారు ఆంక్షలు
హైదరాబాద్: సర్కారు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించనుంది. పలు శాఖల్లో వివిధ రంగాల వ్యయంపై అనేకరకాల ఆంక్షలను విధిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రులకు కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నారుు. మంత్రులైనా, అధికారులైనా విమానాల్లో ఇకపై ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించనున్నారు. వీలైనంత మేర ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిందిగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖ అధికారులను ఆదేశించారు. ప్రణాళికేతర వ్యయం తగ్గింపు, పొదుపు చర్యలపై మంత్రి మంగళవారం అధికారులతో సమీక్షించారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ మేరకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఆర్థిక శాఖ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేయనుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టరాదని, వీలైతే ఉన్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని కూడా తగ్గించేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలకు ఈ ఆంక్షలు వర్తింప చేయనున్నారు. -
ఎకానమీ ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్
న్యూఢిల్లీ: కొంత మొత్తం అదనంగా చెల్లిస్తే దేశీ రూట్లలో ఎకానమీ తరగతి ప్రయాణికులు బిజినెస్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందుకోసం వారు తీసుకున్న ఎకానమీ టికెట్ రేటు కన్నా రూ. 5,000 నుంచి రూ. 7,000 దాకా అదనంగా చెల్లించాల్సి వస్తుందని వివరించింది. ప్రయాణాలకు సంబంధించి ముందస్తుగా కొనుక్కున్న చౌక టికెట్లకు కూడా .. ‘గెట్ అప్ ఫ్రంట్’ అనే ఈ అప్‌గ్రేడ్ స్కీము వర్తిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర 43 నగరాల్లో అక్టోబర్ 31 దాకా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తూ.. బిజినెస్ తరగతిలో అందుబాటులో ఉన్న సీట్లను బట్టి .. ఎయిర్‌పోర్టులో చెక్ ఇన్‌కి ముందు మాత్రమే సీట్ల కేటాయింపు జరుగుతుంది. స్కీము కింద 750 కిలోమీటర్ల దాకా దూరం ప్రయాణాలు చేసే వారు అప్‌గ్రేడ్ కోసం రూ. 5,000, 750 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించే వారు రూ. 7,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఢిల్లీ-ముంబై రూట్లో బిజినెస్ క్లాస్ టికెట్ రేటు సుమారు రూ. 25,000గా ఉంది. అయితే, చాలా ముందస్తుగా ఎకానమీ తరగతిలో చౌకగా రూ.5,000కి టికెట్ కొనుక్కున్న వారు.. అదనంగా రూ. 7,000 కట్టి బిజినెస్ క్లాస్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫలితంగా మొత్తం చార్జీ రూ. 12,000 మాత్రమే అవుతుంది. అయినప్పటికీ సాధారణంగా బిజినెస్ తరగతి టికెట్‌కి ఉండే రేటు కన్నా ఇది సగం స్థాయిలోనే ఉంటుందని ఎయిరిండియా పేర్కొంది. పూర్తి ఎకానమీ సర్వీసులే నడుపుతున్న కొన్ని రూట్లలో తొలి 3 వరుసలను అప్‌గ్రేడ్ చేసుకున్న ప్రయాణికులకు కేటాయించి, ప్రీమియం సర్వీసులు అందిస్తామని ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు.