ఓ టాప్ హీరో సాధరణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తే.. అబ్బో ఊహించడానికే కాస్తా అతిగా అనిపిస్తుంది కదా. కానీ దీన్ని నిజం చేసి చూపారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫేక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సాధరణ ప్రయాణికుడి మాదిరిగా ఎకానమీ క్లాస్‌లో పర్యటించారు ఆమిర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇండిగోకు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఉన్నట్టుండి ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో కూర్చుని.. తోటి ప్రయాణికులతో నవ్వుతూ మాట్లాడారు. దీన్ని కాస్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమిర్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘ఆమిర్ భాయ్.. నువ్వు రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసిన ఆమిర్.. త్వరలోనే ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రంలో నటించబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment