విమాన టిక్కెట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ | Jet Airways Offers 30 Percent Discount On Flight Charges | Sakshi
Sakshi News home page

విమాన టిక్కెట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌

Jun 27 2018 2:06 PM | Updated on Jun 27 2018 2:07 PM

Jet Airways Offers 30 Percent Discount On Flight Charges - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌ అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ బుక్‌నౌ. ఫ్లైనౌ వెబ్‌సైట్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. ప్రీమియర్‌, ఎకానమీ క్లాస్‌ టికెట్స్‌పై వర్తించే ఈ ఆఫర్‌ 2018, జూన్‌ 30 నాటికి ముగియనున్నట్టు అధికారులు చెప్పారు.

వన్‌వే, రిటర్న్‌ జర్నీలు రెండింటికీ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. అమస్టర్‌డ్యామ్‌, కొలంబో, పారిస్‌ తప్ప మిగతా అన్ని జెట్‌ ఎయిర్‌వేస్‌ అంతర్జాతీయ రూట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని  విమానయాన సంస్థ ప్రకటించింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్‌ టికెట్స్‌ బేస్‌ ధరలపై కూడా 25 శాతం డిస్కౌంట్‌ని అందించనున్నట్టు జెట్‌ ఎయిర్‌ వేస్  ప్రకటించింది‌.

జులై 11,2018 నాటి నుంచి ప్రయాణ కాలానికి సంబంధించి కనీసం 15 రోజుల ముందస్తుగా ఈ టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. మిగతా ఛార్జీలు, పరిమితులన్నింటిన్నీ టిక్కెట్‌ నియమ నిబంధనల్లో పేర్కొన్నట్టు కంపెనీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement