international routes
-
13 రూట్లలో విమాన సర్వీసులు రద్దు
సాక్షి, ముంబై : ఆర్థిక సమస్యలు, రుణ భారంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రయివేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. విమానాలకు అద్దెలు చెల్లించలేక, పైలెట్లకు జీతాలు చెల్లించలేక పలు విమానాల రద్దు చేసుకుంటూ వస్తోంది. తాజా 13 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను రద్దు చేసింది. ఏప్రిల్ చివరివరకు ఈ నిర్ణయం అమలవుతుందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అద్దె బకాయిలు చెల్లించలేక మరో 7 విమానాలను కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రద్దు చేసిన విమానాల సంఖ్య 54కు చేరింది. ఇప్పటికే ముంబై -ఢిల్లీ మధ్య విమానాల సర్వీసులను కూడా బాగా తగ్గించింది. అలాగే ముంబై -మాంచెస్టర్ మధ్య సర్వీసులను ఇప్పటికే రద్దు చేసుకుంది. కాగా జీతాలు చెల్లించకుంటే వచ్చేనెలనుంచి విధులకు హాజరుకామని ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ పైలట్లు యాజమాన్యాన్ని హెచ్చరించారు. జీతాల్లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. మరోవైపు వందలాది మంది పైలెట్లు ఉద్యోగాలకోసం ఇతర విమానయాన సంస్థలను ఆశ్రయించిన సంగతి విదితమే. -
విశాఖ-కౌలాలంపూర్ టిక్కెట్ రూ.3,399!
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ స్థానిక నగరాల నుంచి ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కేవలం రూ.3,399కే అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 15 వరకు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ఏషియా ప్రకటించిన ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల సేల్ ప్రయాణ కాలం 2019 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమై 2019 ఆగస్టు 13 వరకు ముగియనుందని ఎయిర్ఏషియా.కామ్‌లో వెల్లడించింది. న్యూఢిల్లీ, అమృత్సర్, జైపూర్ వంటి నగరాల నుంచి వీటి విమానాలు బయలుదేరతాయి. కౌలాలంపూర్, క్రాబీ, హనోయి, ఆక్లాండ్ వంటి దేశాలకు ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఎంబార్గో కాలాల్లో ఈ ధరలు అందుబాటులో ఉండవు. తక్కువ ధరకే ఎయిర్ఏషియా విమాన టిక్కెట్ ఆఫర్.. విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ వరకు అంతర్జాతీయ విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా తన సేల్ కింద అత్యంత తక్కువగా రూ.3,999కే అందిస్తోంది. క్రెడిట, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా పేమెంట్లు జరిపే వాటికి నాన్-రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ ధరలోనే ఎయిర్‌పోర్టు పన్నులు కలిసి ఉంటాయి. అయితే డిపార్ట్చర్ సమయంలో సేకరించే ఎయిర్‌పోర్టు పన్నులు దీనిలో ఉండవు. సీట్లు కూడా పరిమితమే. అన్ని ఎయిర్ఏషియా విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ సేల్ కింద అమృత్సర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే విమాన టిక్కెట్‌ను రూ.4,490కు అందిస్తుంది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్‌కు, సింగపూర్‌కు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.6,436కు ప్రారంభమవుతుంది. కోల్‌కతా నుంచి కౌలాలంపూర్, పెర్త్లకు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.11,355 నుంచి ఉంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సిడ్నీలకు రూ.3,497, న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్, బ్యాండంగ్కు రూ.8,730, బెంగళూరు నుంచి కౌలాలంపూర్, మెల్బోర్న్కు రూ.14,999కు విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా విక్రయిస్తోంది. -
విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై : దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ బుక్‌నౌ. ఫ్లైనౌ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టికెట్స్‌పై వర్తించే ఈ ఆఫర్ 2018, జూన్ 30 నాటికి ముగియనున్నట్టు అధికారులు చెప్పారు. వన్‌వే, రిటర్న్ జర్నీలు రెండింటికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అమస్టర్‌డ్యామ్, కొలంబో, పారిస్ తప్ప మిగతా అన్ని జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ రూట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని విమానయాన సంస్థ ప్రకటించింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్స్ బేస్ ధరలపై కూడా 25 శాతం డిస్కౌంట్ని అందించనున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జులై 11,2018 నాటి నుంచి ప్రయాణ కాలానికి సంబంధించి కనీసం 15 రోజుల ముందస్తుగా ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. మిగతా ఛార్జీలు, పరిమితులన్నింటిన్నీ టిక్కెట్ నియమ నిబంధనల్లో పేర్కొన్నట్టు కంపెనీ తెలిపింది. -
సమ్మర్ హాలిడేస్: చౌకగా విదేశీయానం
ముంబై: వేసవి సెలవులు వచ్చేశాయి. ఎక్కడికైనా సరదాగా వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, విదేశీ ప్రయాణానికి సిద్ధం కండి. ఎందుకంటే ఈ సమ్మర్ లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లడం చాలా చౌకగా మారిందట. లండన్, సింగపూర్, సిడ్ని, కౌలాలంపూర్ వంటి విదేశాలకు వెళ్లడానికి విమాన ఛార్జీలు కిందకి దిగొచ్చాయని వెళ్లడైంది. అంతర్జాతీయ మార్గాల్లో విమాన ఛార్జీలు 28 శాతం వరకు పడిపోయాయని తెలిసింది. బ్రూసెల్స్ విమానయాన సంస్థ వంటి విదేశీ క్యారియర్స్ ఆగమనంతో 2016 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విమానసంస్థల టిక్కెట్ ధరలు కిందకి దిగొచ్చాయని టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనం ప్రకారం ఢిల్లీ నుంచి లండన్ ప్రయాణం రూ.31,800కి దిగొచ్చిందని, గతేడాది ఇదే నెలలో టిక్కెట్ ధర రూ.39,497గా ఉందని తెలిసింది. అంటే గతేడాది కంటే 19 శాతం తగ్గిపోయింది. అదేవిధంగా ఢిల్లీ నుంచి సింగపూర్ ప్రయాణ ఛార్జీలు కూడా 22 శాతం పడిపోయి, రూ.22,715గా నమోదైనట్టు కాక్స్ అండ్ కింగ్స్ అధ్యయనం పేర్కొంది. 2016 ఏప్రిల్ లో ఈ ధర 29,069 రూపాయలుగా ఉన్నట్టు తెలిసింది. తమ రిపోర్టు ప్రకారం ఈ సమ్మర్ లో విమాన టిక్కెట్ ఖర్చులు గతేడాది కంటే తగ్గినట్టు తెలిసిందని కాక్స్ అండ్ కింగ్స్ బిజినెస్ హెడ్ జాన్ నాయర్ చెప్పారు. అన్నింటి కంటే ముంబాయి-కౌలాలంపూర్ ధర దాదాపు 28 శాతం వరకు తగ్గిపోయి, 20,377 రూపాయలుగా ఉందని రిపోర్టు పేర్కొంది. విదేశీ ఎయిర్ లైన్స్ ఎంట్రీతో పాటు ఇంధన ధరలు దిగిరావడంతో విమానసంస్థలు ధరలు తగ్గించినట్టు రిపోర్టు వెల్లడించింది. -
ఎయిర్ ఇండియా శీతాకాల ఆఫర్లు
ముంబై: ఎయిర్ ఇండియా సంస్థ అంతర్జాతీయ రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. షార్ట్-టెర్మ్ గ్లోబల్ వింటర్ సేల్ బొనాంజా పేరుతో ఎయిర్ ఇండియా ఈ ఆఫర్లనందిస్తోంది. ఎయిర్ ఇండియా చలికాలం ఆఫర్లతో విమానయాన రంగం వేడెక్కనున్నదని, తాజా ధరల పోరుకు తెరలేవనున్నది నిపుణులంటున్నారు. ఎంపిక చేసిన రూట్లలో రాను పోను చార్జీలు కనిష్టంగా రూ.19,999కే ఎయిర్ ఇండియా అఫర్ చేస్తోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, చైనా, రష్యా, సింగపూర్, థాయ్‌లాండ్‌లలోని మొత్తం 33 నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులందజేస్తోంది. ఈ ఆఫర్లకు టికెట్ల బుకింగ్ బుధవారం నుంచే ప్రారంభమైందని, వచ్చే నెల 2 వరకూ అందుబాటులో ఉంటుందని, వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఆఫర్ల వివరాలు..., ఢిల్లీ-చికాగో/న్యూయార్క్, ఢిల్లీ-మెల్బోర్న్/సిడ్నీ రూట్లకు చార్జీ రూ.49,999. ఢిల్లీ-రోమ్/మిలన్/ఫ్రాంక్ఫర్ట్/ప్యారిస్/లండన్/బర్మింగ్‌హామ్ రూట్లకు చార్జీ రూ.39,999. ఢిల్లీ-టోక్యో/ఒసాకా/సియోల్ రూట్లకు చార్జీ రూ.39,999. ఢిల్లీ-బ్యాంకాక్/సింగపూర్ రూట్లకు చార్జీ రూ.19,999గా ఉంది.