Discount on tickets
-
TSRTC: ప్రయాణీకులకు బంపరాఫర్..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఆఫర్లను ఇచ్చింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులకు బస్సు టికెట్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. దీని కోసం వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాద్‌లో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టీ-24 టికెట్‌ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్ ధర రూ.50గా నిర్ణయించింది. ఇక, టీఎస్ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్ -
రైళ్లలో రాయితీలు కొందరికే
సాక్షి, అమరావతి: రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు రాయితీని పునరుద్ధరించకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ హైకోర్టుకు నివేదించింది. రాయితీలు కల్పించిన మొత్తం 53 కేటగిరీల్లో దివ్యాంగులు, 11 కేటగిరీల రోగులు, విద్యార్థులకు మినహా మిగిలిన వారెవరికీ ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని పేర్కొంది. కోవిడ్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వృద్ధుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని, తమ చర్యల ద్వారా ఎవరి ప్రాథమిక హక్కులకు భంగం కలగడం లేదని నివేదించింది. కరోనా విషయంలో తదుపరి వైద్యపరమైన సూచనలు, సలహాలు అందేవరకు రాయితీ పునరుద్ధరణ సాధ్యం కాదని వెల్లడించింది. రాయితీని పొడిగించకపోవడం ఎంతమాత్రం అన్యాయం, ఏకపక్షం, వివక్షపూరితం, రాజ్యాంగ విరుద్ధం కాదంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని సవరించాలని పిటిషనర్ డిమాండ్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వృద్ధులకు రాయితీని పునరుద్ధరించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను కొట్టి వేయాలని రైల్వే శాఖ అభ్యర్థించింది. రాయితీ పునరుద్ధరణ కోసం పిల్.. వృద్ధులకు రైళ్లు, ఆర్టీసీ బస్సు చార్జీల్లో కోవిడ్ సమయంలో రద్దు చేసిన రాయితీని పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీకాకుళానికి చెందిన జీఎన్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం ఆదేశాల మేరకు రైల్వేశాఖ తరఫున దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ కమర్షియల్ మేనేజర్ బీడీ క్రిష్టోఫర్ కౌంటర్ దాఖలు చేశారు. రైలు ప్రయాణికులకు రాయితీలు కల్పించడం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ విధానపరమైన నిర్ణయమని కౌంటర్లో పేర్కొన్నారు. రాయితీల పునరుద్ధరణ విషయంలో రైల్వే బోర్డు చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ స్వతంత్రంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. రిప్లై దాఖలుకు గడువిచ్చిన ధర్మాసనం.. జీఎన్ కుమార్ దాఖలు చేసిన పిల్ బుధవారం మరోసారి విచారణకు రాగా.. రాయితీలు పునరుద్ధరించకపోవడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీఎస్ఎస్ శ్రీకాంత్ నివేదించారు. రైల్వేశాఖ కౌంటర్‌కు సమాధానమిచ్చేందుకు వీలుగా తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
రూ.999 కే విమాన టికెట్: ఏయే రూట్లలో?
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది. తగ్గింపు రేట్లలో 60 వేల విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 999 రూపాయల నుంచి టికెట్ ధరలు ప్రారంభం. ఈ మూడు రోజుల అమ్మకపు కాలం శనివారం (మార్చి 13) నుండి ప్రారంభమై మార్చి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు. సీట్లున్నంతవరకు టికెట్లు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వర్తించనుంది. ఢిల్లీ-జైపూర్/ప్రయాగ్‌రాజ్, హైదరాబాద్-బెలగాం, అహ్మదాబాద్ -కాండ్లా, బెంగళూరు-కొచ్చి /కాజీకోడ్ వంటి పలు నగరాలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బయలుదేరడానికి ఒక వారం ముందు తేదీని ఉచితంగా మార్చకోడానికి కూడా అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. pic.twitter.com/UqzTz4svum — Alliance Air (@allianceair) March 12, 2021 -
గోఎయిర్ రిపబ్లిక్ డే సేల్ : బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గోఎయిర్ రిపబ్లిక్ డే ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ ప్రయాణికుల కోసం సుమారు 10 లక్షల సీట్లను తగ్గింపు ధరలో అందిస్తోంది. టికెట్ ధరను రూ.859 (అన్నీ కలిపి) కే అందిస్తున్నట్లు గోఎయిర్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 22 నుంచి జనవరి 29 మధ్య టికెట్లను బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ చార్జీలు డైరెక్ట్ ఫ్లైట్లలో కేవలం ఒకవైపు ప్రయాణానికి మాత్రమేనని పేర్కొంది. అలాగే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 14 రోజుల లోపు ఏవైనా మార్పులు చేసినా చార్జీలు ఏవీ ఉండవనిసంస్థ తెలిపింది. -
ఎయిరిండియా బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఖరి నిమిషంలో బుక్ చేసుకునే విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ అందిస్తామని ప్రకటించింది. ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన వాణిజ్య సమీక్షా సమావేశంలో లాస్ట్ మినిట్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించే నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటనలో తెలిపింది. దేశీయ మార్గాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్టు తెలిపింది. వాస్తవానికి లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకునే టికెట్లు సాధారణంగా 40 శాతం అధికంగా ఉంటాయి. కానీ జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినిట్ బుకింగ్‌లపై 50శాతం తగ్గింపును వర్తింప జేయనుంది. ప్రయాణానికి మూడు గంటలలోపు బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు వర్తిస్తుందని సీనియర్ అధికారి చెప్పినట్టుగా పీటీఐ రిపోర్టు చేసింది. ఏజెంట్లతో పాటు ఎయిరిండియా కౌంటర్లు, ఎయిరిండియా వెబ్సైట్, లేదా మొబైల్ యాప్‌లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. -
జెట్ ఎయిర్వేస్ దివాలీ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: ఫెస్టివ్ సీజన్లో విమానయాన సంస్థలు డిస్కౌంట్ రేట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. 30శాతం డిస్కౌంట్‌తో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన టికెట్లను (వన్‌వే, రిటన్) ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లో ఏడురోజులు (అక్టోబర్ 30-నవంబరు 5) వరకు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది జెట్ ఎయిర్వేస్. హ్యాపీ దివాలీ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ విక్రయాల్లో ఎకానమీ, ప్రీమియర్ , ఇంటర్నేషనల్ ఇలా అన్నింటిలోనూ 30శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే జెట్ ఎయిర్వేస్ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నవారికి అదనపు సౌకర్యాలను కూడా అందిస్తోంది. 24గంటల లోపు క్యాన్సిల్ చేసుకుంటే జీరో పెనాల్టీ. నామినల్ ఫీతో ఎయర్‌పోర్ట్ లాంజ్‌ను వాడుకునే అవకాశం. ఇంకా ప్రతి బుకింగ్‌పై 250 జేపీ మైల్స్ బోనస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. -
ఇండిగో దివాలీ సేల్ : 10లక్షల టికెట్లపై డిస్కౌంట్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో దీపావళి ఆఫర్ ప్రకటించింది. పండుగ వేడుకల్లో భాగంగా మూడు రోజుల దీపావళి ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. అక్టోబర్ 24-26వరకు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 40శాతం డిస్కౌంట్‌తో 10లక్షల సీట్లను కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించింది. అన్ని చార్జీలు కలిపి రూ. 899 ప్రారంభ ధరలో టికెట్లను అందిస్తోంది. ఇండిగో నెట్‌వర్క్‌లో మొత్తం 64 ప్రాంతాలకు ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. ఇలా బుక్ చేసుకున్నటికెట్లు నవంబరు 8,2018 -ఏప్రిల్ 15,2019 మధ్య ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయి. తమ కస్టమర్ల సౌలభ్యం, సంతోషం కోసం మూడు రోజుల దివాలీ స్పెషల్ సేల్‌ను ప్రారంభించామని ఇండిగో కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. దేశీయంగా రూ.899, అంతర్జాతీయ మార్గాల్లో రూ. 3399 ప్రారంభ ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు తెలిపారు. కుటుంబాలు, స్నేహితులను కలుసుకునే సందర్భం దీపావళికి తక్కువ ధరల్లో టికెట్లను అందించడం ద్వారా తమ కస్టమర్లకు మంచి అనుభవాన్ని మిగులుస్తుందన్నారు. చాలా తొందరగా వినియోగదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై : దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ అంతర్జాతీయ విమాన టిక్కెట్ల ధరలపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ బుక్‌నౌ. ఫ్లైనౌ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని విమానయాన సంస్థ అధికారులు తెలిపారు. ప్రీమియర్, ఎకానమీ క్లాస్ టికెట్స్‌పై వర్తించే ఈ ఆఫర్ 2018, జూన్ 30 నాటికి ముగియనున్నట్టు అధికారులు చెప్పారు. వన్‌వే, రిటర్న్ జర్నీలు రెండింటికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అమస్టర్‌డ్యామ్, కొలంబో, పారిస్ తప్ప మిగతా అన్ని జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ రూట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని విమానయాన సంస్థ ప్రకటించింది. దేశీయ మార్గాలలో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్స్ బేస్ ధరలపై కూడా 25 శాతం డిస్కౌంట్ని అందించనున్నట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జులై 11,2018 నాటి నుంచి ప్రయాణ కాలానికి సంబంధించి కనీసం 15 రోజుల ముందస్తుగా ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. మిగతా ఛార్జీలు, పరిమితులన్నింటిన్నీ టిక్కెట్ నియమ నిబంధనల్లో పేర్కొన్నట్టు కంపెనీ తెలిపింది. -
ఎయిర్కోస్టా రూ.1,000 డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇప్పటి వరకు ఎయిర్‌కోస్టాలో పది లక్షల మంది ప్రయాణం చేసినందుకు గాను అన్ని టికెట్లపై రూ. 1,000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. జూలై 10 ఉదయం10 గంటల నుంచి జూలై 14 సాయంత్రం ఆరు గంటల లోపు బుక్ చేసుకున్న టికెట్లపై ఈ తగ్గింపు వర్తిస్తుందని ఎయిర్కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 24లోపు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.