
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆఖరి నిమిషంలో బుక్ చేసుకునే విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ అందిస్తామని ప్రకటించింది. ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన వాణిజ్య సమీక్షా సమావేశంలో లాస్ట్ మినిట్ టికెట్లపై భారీ డిస్కౌంట్ అందించే నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా అధికారిక ప్రకటనలో తెలిపింది.
దేశీయ మార్గాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్టు తెలిపింది. వాస్తవానికి లాస్ట్ మినిట్‌లో బుక్ చేసుకునే టికెట్లు సాధారణంగా 40 శాతం అధికంగా ఉంటాయి. కానీ జెట్ ఎయిర్ వేస్ సంక్షోభం, పలు విమానాల రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో ఎయిరిండియా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. అందుబాటులో ఉన్న సీట్లలో లాస్ట్ మినిట్ బుకింగ్‌లపై 50శాతం తగ్గింపును వర్తింప జేయనుంది. ప్రయాణానికి మూడు గంటలలోపు బుక్ చేసుకుంటే ఈ తగ్గింపు వర్తిస్తుందని సీనియర్ అధికారి చెప్పినట్టుగా పీటీఐ రిపోర్టు చేసింది. ఏజెంట్లతో పాటు ఎయిరిండియా కౌంటర్లు, ఎయిరిండియా వెబ్‌సైట్, లేదా మొబైల్ యాప్‌లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment