
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ప్రయాణీకులకు టీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో పలు ఆఫర్లను ఇచ్చింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
వివరాల ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులకు బస్సు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. దీని కోసం వయసు ధ్రువీకరణకు ఆధార్‌కార్డు చూపాలని స్పష్టం చేసింది. అదే విధంగా హైదరాబాద్‌లో 24 గంటల అపరిమిత ప్రయాణానికి సంబంధించి టీ-24 టికెట్‌ను రూ.75కే ఇవ్వనున్నట్లు తెలిపింది. పిల్లలకు టీ-24 టికెట్ ధర రూ.50గా నిర్ణయించింది.
ఇక, టీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లను సంప్రదించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment