సాక్షి, న్యూఢిల్లీ: ఫెస్టివ్ సీజన్‌లో విమానయాన సంస్థలు డిస్కౌంట్ రేట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా జెట్ ఎయిర్‌వేస్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. 30శాతం డిస్కౌంట్‌తో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన టికెట్లను (వన్‌వే, రిటన్) ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్‌లో ఏడురోజులు (అక్టోబర్ 30-నవంబరు 5) వరకు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది జెట్ ఎయిర్‌వేస్. హ్యాపీ దివాలీ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ విక్రయాల్లో ఎకానమీ, ప్రీమియర్ , ఇంటర్నేషనల్ ఇలా అన్నింటిలోనూ 30శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
అలాగే జెట్ ఎయిర్‌వేస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకున్నవారికి అదనపు సౌకర్యాలను కూడా అందిస్తోంది. 24గంటల లోపు క్యాన్సిల్ చేసుకుంటే జీరో పెనాల్టీ. నామినల్ ఫీతో ఎయర్‌పోర్ట్ లాంజ్‌ను వాడుకునే అవకాశం. ఇంకా ప‍్రతి బుకింగ్‌పై 250 జేపీ మైల్స్ బోనస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment