జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలీ ఆఫర్‌ | Jet Airways' Diwali Sale: Up To 20% Off On Domestic, International Flights | Sakshi
Sakshi News home page

జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలీ ఆఫర్‌

Published Tue, Oct 17 2017 4:02 PM | Last Updated on Tue, Oct 17 2017 4:33 PM

Jet Airways' Diwali Sale: Up To 20% Off On Domestic, International Flights

సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి సందర‍్భంగా  విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌ వేస్‌  డిస్కౌంట్‌ ధరలను  ప్రకటించింది.  స్పెషల్‌ లిమిటెడ్‌ పీరియడ్‌ పథకం కింద తొమ్మిది రోజులు అమ్మకాలను  ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటించింది.  ఈ ఆఫర్‌ లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై  20శాతం దాకా  తగ్గింపు ధరలను ఆఫర్‌  చేస్తోంది.   దివాలీ 2017 పథకం కింద అక్టోబర్‌ 17నుంచి 25 వరకు   ఈ  స్పెషల్‌ సేల్‌ నిర్వహిస్తోంది.   నవంబర్ 1, 2017 నుంచి ప్రయాణానికి వినియోగించుకోవచ్చు. 

దీపావళి 2017 పథకం కింద ప్రీమియర్ టిక్కెట్లలో 20 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్‌ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జెట్ ఎయిర్వేస్  అందిస్తున్న దేశీయ ,  విదేశీయంగా ఆకర్షణీయమైన ప్రయాణ ఆఫర్లను  ఆస్వాదించాలని   జెట్ ఎయిర్వేస్ చీఫ్ వాణిజ్య అధికారి జయరాజ్ షణ్ముగం అన్నారు.  వన్-వే ,  తిరిగి ప్రయాణాల కోసం ఈ ఆఫర్‌ వర్తిస్తుందని జెట్‌ ఎ యిర్‌వేస్‌ తెలిపింది.  దేశీయ టికెట్ల ద్వారా నవంబర్‌ నుంచి ప్రయాణింవచ‍్చని అలాగే గెస్ట్‌బుకింగ్‌ ఇంటర్నేషనల్‌ టికెట్ల  ద్వారా వెంటనే ప్రయాణించవచ్చని   పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement