జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో 50% వరకు డిస్కౌంట్` | Jet Airways Offers Up to 50% Discount on Domestic and International Flights | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో 50% వరకు డిస్కౌంట్

Published Fri, Oct 3 2014 2:59 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో 50% వరకు డిస్కౌంట్`

జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో 50% వరకు డిస్కౌంట్`

విమానయాన సంస్థల పోటీ పుణ్యమాని ప్రయాణికులకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ తాజాగా కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎకానమీతో పాటు ప్రీమియర్ క్లాసు ప్రయాణాలకు, అదికూడా స్వదేశీ, అంతర్జాతీయ ప్రయాణాలు అన్నింటికీ 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 6వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వాటిలో నవంబర్ 5వ తేదీ వరకు ప్రయాణించవచ్చు.

జెట్ ఎయిర్వేస్తో పాటు దాని వ్యూహాత్మక భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ నడిపే విమానాల్లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ పనిచేస్తుంది. స్వదేశీ విమానాల్లో అయితే బేస్ ఫేర్, ఫ్యూయెల్ ఛార్జీమీద డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతర్జాతీయ విమానాల్లో అయితే మాత్రం కేవలం బేస్ ఫేర్ మీద మాత్రమే రాయితీ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement