ఇండిగో దివాలీ సేల్‌ : 10లక్షల టికెట్లపై డిస్కౌంట్‌ | Diwali special sale: IndiGo offering 10 lakhs seats for as low as Rs 899 | Sakshi
Sakshi News home page

ఇండిగో దివాలీ సేల్‌ : 10లక్షల టికెట్లపై డిస్కౌంట్‌

Published Wed, Oct 24 2018 3:03 PM | Last Updated on Wed, Oct 24 2018 3:33 PM

Diwali special sale: IndiGo offering 10 lakhs seats for as low as Rs 899 - Sakshi

సాక్షి, ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ ఇండిగో దీపావళి ఆఫర్‌ ప్రకటించింది. పండుగ వేడుకల్లో భాగంగా మూడు రోజుల దీపావళి ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. అక్టోబర్‌ 24-26వరకు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది. 40శాతం డిస్కౌంట్‌తో 10లక్షల సీట్లను  కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించింది. అన్ని చార్జీలు కలిపి రూ. 899 ప్రారంభ ధరలో టికెట్లను అందిస్తోంది.  ఇండిగో నెట్‌వర్క్‌లో మొత్తం 64  ప్రాంతాలకు ఈ తగ్గింపు  ధరలు అమల్లో ఉంటాయి. ఇలా బుక్‌ చేసుకున్నటికెట్లు నవంబరు 8,2018 -ఏప్రిల్ 15,2019 మధ్య ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయి.

తమ కస్టమర్ల సౌలభ్యం, సంతోషం కోసం మూడు రోజుల దివాలీ స్పెషల్‌ సేల్‌ను ప్రారంభించామని ఇండిగో కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు.  దేశీయంగా రూ.899, అంతర్జాతీయ మార్గాల్లో రూ. 3399 ప్రారంభ ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు తెలిపారు. కుటుంబాలు, స్నేహితులను కలుసుకునే సందర్భం దీపావళికి తక్కువ ధరల్లో టికెట్లను అందించడం ద్వారా తమ కస్టమర్లకు మంచి అనుభవాన్ని మిగులుస్తుందన్నారు. చాలా తొందరగా వినియోగదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement