ముంబై: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరిచయం చేస్తోంది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లతోపాటు స్వల్ప దూర అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం దేశీయంగా విస్తారా మాత్రమే ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా ఏ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లో బిజినెస్ క్లాస్‌లో 8 సీట్లు, ప్రీమియం ఎకానమీ 24, ఎకానమీ విభాగంలో 132 సీట్లను కేటాయించింది.
తొలుత ఢిల్లీ–బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చండీఘఢ్–ఢిల్లీ రూట్లలో ప్రీమియం ఎకానమీ క్లాస్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఏడాదిలో ఎయిర్ ఇండియా తన పూర్తి స్థాయి నారో-బాడీ ఫ్లీట్ కు త్రీ-క్లాస్ కాన్ఫిగరేషన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది..
Comments
Please login to add a commentAdd a comment